Wimbledon Winner: జకోవిచ్ దే వింబుల్డన్
సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ అదరగొట్టాడు. కెరీర్ లో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
- Author : Hashtag U
Date : 10-07-2022 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ అదరగొట్టాడు. కెరీర్ లో ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జకోవిచ్ 6,6-3,6-4,7-6(7-3) తేడాతో కిర్గియోస్ పై విజయం సాధించాడు.
తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన కిర్గియోస్ వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్ కు తొలి సెట్ లోనే షాక్ ఇచ్చాడు. అయితే మొదటి సెట్లో ఓడినప్పటికీ ఒత్తిడికి ఏ మాత్రం వెనక్కి తగ్గని జకోవిచ్.. రెండు, మూడు సెట్లలో గెలుపొందాడు.
😘#Wimbledon | #CentreCourt100 | @DjokerNole pic.twitter.com/Y6K5hPs58K
— Wimbledon (@Wimbledon) July 10, 2022
అయితే నాలుగో సెట్ హోరాహోరీగా సాగి టై అయింది. టై బ్రేకర్‌లో పై చేయి సాధించిన జకోవిచ్ ఏడో వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. జకోవిచ్ కెరీర్ లో ఇది 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్. తాజా గెలుపుతో అత్యధిక విజయాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫెదరర్‌ను వెనక్కినెట్టాడు. రఫెల్ నాదల్ 22 టైటిళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే అత్యధిక సార్లు వింబుల్డన్ గెలిచిన ఆటగాళ్ళ జాబితాలో సంప్రాస్ రికార్డును ఈ సెర్బియన్ స్టార్ సమం చేసాడు. 2018,2019,2021,2022లో వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. కరోనా కారణంగా 2020లో వింబుల్డన్ నిర్వహించ లేదు
"Don't drop it!" 😅
It's been a special first #Wimbledon visit for Prince George 🏆#CentreCourt100 | @KensingtonRoyal pic.twitter.com/VKXg06hPCU
— Wimbledon (@Wimbledon) July 10, 2022