HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Netherlands Thrash Bangladesh By 87 Runs

world cup 2023: నెద‌ర్లాండ్స్ మ‌రో సంచ‌లనం.. బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యం

వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికా ఓడించి టోర్నీలో సంచలనం రేపి .. తాజాగా బాంగ్లాదేశ్ కు షాకిచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది

  • Author : Vamsi Chowdary Korata Date : 29-10-2023 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup 2023 (62)
World Cup 2023 (62)

world cup 2023: వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటికే సౌతాఫ్రికాని ఓడించి టోర్నీలో సంచలనం రేపి .. తాజాగా బాంగ్లాదేశ్ కు షాకిచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి 142 పరుగులకు ఆలౌటైంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లకు 229 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (89 బంతుల్లో 68* 6 ఫోర్లు) . వెస్లీ బరేసి 41, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 35, లోగాన్ వాన్ బీక్ 23 ప‌రుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ ష‌కీబ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. దీనికి సమాధానంగా బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ నలుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లా బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ టైటిల్ రేసులో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయం సాధించింది.

నెదర్లాండ్స్1996లో మొదటి ప్రపంచ కప్‌ను ఆడింది. దీని తర్వాత 2003, 2007 మరియు 2011 ప్రపంచ కప్‌లను కూడా ఆడింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్‌లో 27 ఏళ్ల ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్ తరఫున వన్డే క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 44 మ్యాచ్‌ల్లో 15 అర్ధ సెంచరీలు సాధించాడు.

Also Read: Israel Hamas War: భయంకరంగా మారిన ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 87 runs
  • bangladesh
  • Edwards
  • NED vs BAN
  • Netherlands
  • world cup 2023

Related News

Rohingya Boat Accident

Rohingya Boat Accident: అండమాన్ సముద్రంలో పడవ బోల్తా పడి 250 మంది గల్లంతు!

రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తున్న ఓ పడవ అండమాన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులు సహా దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. “దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ న

    Latest News

    • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    Trending News

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd