T20 World Cup: నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత..!
T20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్‌లో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- By Gopichand Published Date - 04:24 PM, Tue - 18 October 22

T20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్‌లో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. 122 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు నమీబియా బౌలర్లు పోరాడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. ఇక గ్రూప్-ఏలో ఉన్న నెదర్లాండ్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో సూపర్-12కు దాదాపు అర్హత సాధించినట్లే.
తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. నమీబియా బ్యాటింగ్ లో జాన్ ఫ్రైలింక్ (43 పరుగులు), లింగేన్ (20 పరుగులు) చేశారు. నెదర్లాండ్స్ బౌలింగ్ లో లీడే 2 వికెట్లు, ప్రింగ్లే, ఆకెర్మన్, మీకెరెన్, మెర్వే తలో వికెట్ తీశారు. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఓదౌడ్ (35 పరుగులు), విక్రంజిత్ సింగ్ (39 పరుగులు) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వీరి తర్వాత క్రీజ్ లోకి వచ్చిన లీడే (30 నాటౌట్) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసిన లీడేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.