Neeraj Chopra Net Worth: నీరజ్ చోప్రా ఆస్తి, కార్ల కలెక్షన్,విలాసవంతమైన ఇల్లు
జావెలిన్ త్రోలో భారత్‌కు 2 ఒలింపిక్ పతకాలు సాధించిన నీరజ్ మొత్తం నికర విలువ 4.5 మిలియన్ డాలర్లకు యజమాని. రూపాయలలో కొలిస్తే అతని విలువ దాదాపు రూ.38 కోట్లు. నివేదికల ప్రకారం అతను నెలకు రూ. 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అతని వార్షిక ఆదాయం రూ.4 కోట్లకు పైగా ఉంది.
- By Praveen Aluthuru Published Date - 06:47 PM, Sat - 10 August 24

Neeraj Chopra Net Worth: నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేశాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలిచిన నీరజ్ ఇప్పుడు రజతం కైవసం చేసుకున్నాడు. ఎక్కడ చూసినా నీరజ్ గురించే చర్చ. కాబట్టి నీరజ్ నికర విలువ మరియు అతనికి ఎంత ఆస్తి ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం?
టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత అతనిపై పలు కంపెనీలు కోట్ల వర్షం కురిపించారు .2020 తర్వాత అతనికి పేరు మరియు కీర్తి వచ్చింది. దీంతో గత కొంత కాలంగా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. జావెలిన్ త్రోలో భారత్‌కు 2 ఒలింపిక్ పతకాలు సాధించిన నీరజ్ మొత్తం నికర విలువ 4.5 మిలియన్ డాలర్లకు యజమాని. రూపాయలలో కొలిస్తే అతని విలువ దాదాపు రూ.38 కోట్లు. నివేదికల ప్రకారం అతను నెలకు రూ. 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. అతని వార్షిక ఆదాయం రూ.4 కోట్లకు పైగా ఉంది.
ప్రతి సెలబ్రిటీలాగే నీరజ్ చోప్రా వద్ద కూడా అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది. అతని వద్ద రూ. 2.20 కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 75 లక్షల విలువైన ఫోర్డ్ మస్టాంగ్ జిటి, రూ. 51 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, రూ. 25 లక్షల విలువైన మహీంద్రా ఎక్స్‌యువి700, రూ. 17 లక్షల విలువైన మహీంద్రా థార్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు నీరజ్ చోప్రాకు బజాజ్ పల్సర్ 220 ఎఫ్ మరియు హార్లే డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ కూడా ఉన్నాయి.
Also Read: Uttar Pradesh: 5 కిలోల బంగాళాదుంపలు లంచంగా అడిగిన పోలీస్