HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mumbai Indians Beat Rajasthan Royals By 6 Wickets

MI vs RR: వాంఖేడేలో మురిసిన ముంబై.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై గెలుపు

ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. సొంతగడ్డపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన ముంబై హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది.

  • Author : Naresh Kumar Date : 01-05-2023 - 12:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mumbai Indians
Mumbai Indians

MI vs RR: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. సొంతగడ్డపై భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన ముంబై హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. హైస్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశశ్వి జైశ్వాల్ , జాస్ బట్లర్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. బట్లర్ కాస్త ఇబ్బందిపడినా… జైశ్వాల్ మాత్రం చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లు, వరుస ఫోర్లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జైశ్వాల్ జోరుతో రాజస్థాన్ స్కోర్ టాప్ గేర్‌లో సాగింది. శాంసన్ 14, పటిక్కల్ 2, హోల్డర్ 11 , హిట్‌మెయిర్ 8 , ధ్రువ్ జురెల్ 2 పరుగులకే ఔటయ్యారు. వీరంతా వెనుదిరిగుతున్నా.. జైశ్వాల్ మాత్రం దూకుడు కొనసాగిస్తూ రెచ్చిపోయాడు. 53 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. జైశ్వాల్ మెరుపులతో రాజస్థాన్ 212 పరుగులు చేసింది. జైశ్వాల్ 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 112 పరుగులు బౌండరీ ద్వారానే వచ్చాయి. ముంబై బౌలర్లలో చావ్లా 2, ఆర్చర్, మెరిడెత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ , కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. గ్రీన్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 28 రన్స్‌కు ఔటయ్యాడుయ. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మెరుపు హాఫ్ సెంచరీతో ముంబై ఇన్నింగ్స్ దూకుడుగానే కొనసాగింది.

తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన సూర్యకుమార్ 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అయితే సూర్య ఔటైన తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో ముంబై ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో టిమ్ డేవిడ్, తిలక్ వర్మ భారీ షాట్లతో ముంబైని విజయం దిశగా నడిపించారు. తిలక్ వర్మ సపోర్ట్‌తో రెచ్చిపోయిన టిమ్ డేవిడ్ కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 45 రన్స్ చేశాడు.

చివరి ఓవర్‌లో విజయం కోసం 17 పరుగులు చేయాల్సి ఉండగా… హోల్డర్‌ను ఉతికారేశాడు టిమ్ డేవిడ్. తొలి మూడు బంతుల్లోనే భారీ షాట్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది నాలుగో విజయం. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు ఇది నాలుగో ఓటమి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2023
  • MI vs RR
  • mumbai indians
  • Sandeep
  • surya kumar yadav
  • tim david
  • yashasvi jaiswal

Related News

Hardik Pandya

ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్ న్యూస్‌!

IPL 2026 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఒక విజయం, ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ -0.206గా ఉంది.

  • Delhi Capitals

    ముంబైపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం!

  • IPL 2026 Points Table

    ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

Latest News

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

  • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd