HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ms Dhoni Reveals Post Retirement Plans

MS Dhoni: ఆర్మీలోకి మళ్ళీ ధోనీ .. ఎప్ప్పుడంటే?

ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్​ రిప్లై ఇచ్చాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-12-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS Dhoni
MS Dhoni

MS Dhoni: ధోనికి ప్రస్తుతం 42 ఏళ్ళు. అతనిప్పుడు ఐపీఎల్ లో మాత్రమే రాణిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ఐపీఎల్ లోను ధోనీ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. చెన్నైకి ఐదు ట్రోఫీలు అందించిపెట్టాడు. కాగా ధోనికిదే చివరి ఐపీఎల్ అని కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి మిస్టర్ కూల్ ఇంట్రెస్టింగ్​ రిప్లై ఇచ్చాడు.

చాలా మంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా, క్రికెట్ అకాడమీ నిర్వహించడం, కోచ్​గా, లేదా వ్యాపారం వైపు అడుగులు వేస్తారు. కానీ ఎంఎస్​ ధోనీ ఆట నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఎం చేస్తారు అన్న ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. క్రికెట్ కు పూర్తిస్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించాక ఎక్కువ సమయాన్ని ఆర్మీలో గడపాలనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్మీకి తగిన టైమ్ కేటాయించలేకపోయాను. ఆ లోటును భర్తీ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఆర్మీకి ఎక్కువ టైమ్ కేటాయిస్తానని చెప్పాడు. ధోని చెప్పిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

2011లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోనికి ఇండియన్ ఆర్మీ అరుదైన ఘనతనిచ్చి సత్కరించింది. భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకులో ధోనీని నియమించింది. దీంతో ధోని 2015లో ట్రైనింగ్ క్యాంపులో, 2019లో జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తించాడు. చిన్నప్పటినుంచి ఆర్మీని ఇష్టపడే ధోనీ రిటైర్మెంట్ తర్వాత తనకు ఇష్టమైన ఆర్మీలో గడపడం అభినందనీయం.

Also Read: Nava Kerala Sadas: కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై కేసు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • Indian army
  • IPL
  • ms dhoni
  • retirement

Related News

The Centre has officially announced the names of the martyrs of Operation Sindhur.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో అమరవీరుల పేర్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్ గుండెల్లో దడ పుట్టేలా జరిపిన మెగా కౌంటర్ ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధూర్’. ఈ పోరాటంలో సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా డిక్లేర్ చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తు

  • AP government gives key posting to IAS officer Srilakshmi.

    IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్..

Latest News

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd