HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Moeen Ali Fined For Breaching Icc Code Of Conduct

Moeen Ali Fined: పుట్టినరోజు నాడే మొయిన్‌ అలీకి బిగ్‌ షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా..!

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీకి ఐసీసీ జరిమానా (Moeen Ali Fined) విధించింది.

  • Author : Gopichand Date : 19-06-2023 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Moeen Ali Fined
Resizeimagesize (1280 X 720) 11zon

Moeen Ali Fined: ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీకి ఐసీసీ జరిమానా (Moeen Ali Fined) విధించింది. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో మొయిన్ అలీకి ఐసీసీ జరిమానా విధించింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి వచ్చిన మొయిన్ అలీకి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.

ప్రవర్తనా నియమావళి 2.20ని ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నియమం ఆట స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆటగాళ్ల ప్రవర్తనకు వర్తిస్తుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో రోజు ఆటలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా పడింది. మొయిన్ అలీకి ఐసీసీ ఎందుకు ఈ జరిమానా విధించిందో తెలుసుకుందాం.

Also Read: Yuzvendra Chahal: యుజ్వేంద్ర చహల్ రెడ్ బాల్ ఎంట్రీకి రంగం సిద్ధం?

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్లేయర్ మొయిన్ అలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 18న మొయిన్ అలీ తన పుట్టినరోజున ICC అతన్ని కఠినంగా శిక్షించింది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 89వ ఓవర్‌లో బౌండరీపై నిలబడిన మోయిన్ అలీ ఓ తప్పిదం చేశాడు. ఈ విషయంపై చర్యలు తీసుకున్న ఐసీసీ అతడిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఐసీసీ విధించిన ఈ శిక్షను మొయిన్ అలీ కూడా అంగీకరించాడు.

తన చేతులను పొడిగా ఉంచుకోవడం కోసం అతను అంపైర్ల అనుమతి లేకుండా ఓ స్ప్రేను ఉపయోగించడంతో మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. గత 24 నెలల్లో అతను ఇలాంటి తప్పు చేయడం ఇదే తొలిసారి కాబట్టి ఓ డిమెరిట్ పాయింట్‌ను కూడా అలీ ఖాతాలో యాడ్ చేశారు.

2023 యాషెస్ సిరీస్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ నుంచి జో రూట్ రాణించాడు. అతను సెంచరీ సాధించగా, జానీ బెయిర్‌స్టో, జాక్ క్రాలే కూడా 50 పరుగుల మార్కును దాటారు. దీనికి సమాధానంగా ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీ చేయగా ఆస్ట్రేలియా జట్టు 386 పరుగులు చేసి కుప్పకూలింది. దింతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది .

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashes 2023
  • ENG Vs AUS
  • ICC
  • moeen ali
  • Moeen Ali Fined

Related News

West Indies

వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

వెస్టిండీస్ జట్టులో పలు దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఒకవేళ మ్యాచ్‌కు ముందు ఆ 15 దేశాల జాతీయ గీతాలను ప్లే చేయాల్సి వస్తే దానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది.

  • Suryakumar Yadav

    సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్య‌కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • T20 World Cup 2028

    టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • IND vs SA

    టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

Latest News

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd