HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Messis Magnificent Performance At The Fifa World Cup

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ విశ్వరూపం

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Messi's magnificent performance at the FIFA World Cup.
Messi's magnificent performance at the FIFA World Cup.

మయామిలో శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటీనా అదనపు సమయంలో 3-2తో కేప్‌వెర్డేపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలో మెస్సీ కొట్టిన కార్నర్‌ను రొమెరో హెడర్‌తో గోల్‌గా మలిచే ప్రయత్నం చేయగా… కేప్‌వెర్డే ఆటగాడి చేయికి తగిలిన బంతి గోల్ పోస్ట్‌లోకి వెళ్లడంతో అర్జెంటీనా విజయాన్ని అందుకుంది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో తలపడనుంది.

పసికూన కేప్‌వెర్డేపై అర్జెంటీనా కష్టపడి గెలిచి ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంపై కెప్టెన్ లియోనెల్ మెస్సీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయం సాధించినప్పటికీ జట్టు ఆటలో చాలా లోపాలు కనిపించాయని అన్నాడు. నాకౌట్ దశకు ముందు వాటిని తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

మ్యాచ్‌ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘‘మంచి విషయాలు ఉన్నాయి. అలాగే చాలా తప్పులు కూడా చేశాం. వాటిని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి’’ అని చెప్పాడు.

మ్యాచ్‌ ప్రారంభంలో ఆధిక్యం సాధించిన తర్వాత తమ ఆట మెరుగుపడుతుందని భావించామని మెస్సీ తెలిపాడు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. ‘‘మేం బంతిపై నియంత్రణ కోల్పోయాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాలేకపోయాం. వారు తమ బలాన్ని ఉపయోగించుకుని మాకు ఇబ్బందులు కలిగించారు’’ అని వివరించాడు.

కేప్‌వెర్డేను తక్కువ అంచనా వేయలేదని కూడా మెస్సీ స్పష్టం చేశాడు. స్పెయిన్, ఉరుగ్వే వంటి బలమైన జట్లకు లొంగకుండా ఆ జట్టు ఇంతదూరం వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. నాకౌట్ టోర్నీలో ఏ జట్టూ తేలికగా విజయం ఇవ్వదని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో 29వ నిమిషంలో మెస్సీ గోల్ చేశాడు. దీంతో వరుసగా ఎనిమిది ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టోర్నీలో అర్జెంటీనా ఇప్పటివరకు ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Argentina Football Team
  • Argentina superstar Lionel Messi
  • FIFA world cup
  • Lionel Messi

Related News

    Latest News

    • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

    • ప్రాణం తీసిన కొబ్బరి బొండం

    • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

    • Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

    • Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd