T20: క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్
పొట్టి ఫార్మెట్లో బంతి, బ్యాట్ కు మధ్య జరిగే సమరంలో ఎక్కువ భాగం బ్యాట్ దే ఆధిపత్యం. భారీ సిక్సర్లు, బుల్లెట్ ల దూసుకుపోయే బౌండరీలతో బ్యాటర్లు దుమ్మరేపుతారు
- By Praveen Aluthuru Published Date - 08:53 PM, Wed - 2 August 23
![T20: క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డ్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/08/lowest-score-in-t20-goh-main.jpg)
T20: పొట్టి ఫార్మెట్లో బంతి, బ్యాట్ కు మధ్య జరిగే సమరంలో ఎక్కువ భాగం బ్యాట్ దే ఆధిపత్యం. భారీ సిక్సర్లు, బుల్లెట్ ల దూసుకుపోయే బౌండరీలతో బ్యాటర్లు దుమ్మరేపుతారు. విజయం కోసం ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడితేనే ఆటకు అందం.అలా కాకుండా బ్యాటర్లు క్రీజులోకి అలా వచ్చి వెళ్తే ఎలా ఉంటుంది. టీ20ల్లో రికార్డులే కాదు అత్యంత చెత్త గణాంకాలు కూడా నమోదవుతుంటాయి.
స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో అత్యంత చెత్త రికార్డ్ నమోదైంది . ముందుగా బ్యాటింగ్ బరిలోకి దిగిన ఐసిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసి కేవలం 10 పరుగులకె కుప్పకూలింది. ఈ టీమ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మొత్తం 6 గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఈ ఇన్నింగ్స్ లో 4 పరుగులు మాత్రమే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. జోసఫ్ బుర్రోస్ అనే బ్యాటర్ ఈ మాత్రమైనా పరుగులు చేశాడు. ఈ లక్ష్యాన్ని స్పెయిన్ కేవలం రెండు బంతుల్లోనే ఛేదించింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేశాడు. ఆ తర్వాత వేసిన రెండు బాల్స్ ని అవైస్ అహ్మద్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో 2 బంతుల్లోనే 13 పరుగులు చేసి స్పెయిన్ చారిత్రక విజయాన్ని అందుకుంది.
Also Read: భోళా శంకర్ సెన్సార్ పూర్తి ..
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/Rohit-Retirement.png)
Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన
రోహిత్ కి 37 ఏళ్ళు. రోహిత్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ప్రపంచ కప్ నాటికీ రోహిత్ ఉండాలని కొందరు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి అంటే సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెప్తున్నారు.