HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >List Of Foreign Players Making Their Ipl Debut In 2026

ఐపీఎల్ తొలిసారి ఆడ‌నున్న‌ విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే!

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ గత రెండేళ్లలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. ఆర్‌సీబీ (RCB) రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

  • Author : Gopichand Date : 17-03-2026 - 6:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL Debut
IPL Debut

IPL Debut: ఐపీఎల్ 2026 సీజన్ సరికొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తోంది. ఇందులో దిగ్గజ ఆటగాళ్లతో పాటు కొందరు కొత్త తారలు మెరవడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. ప్రతిసారి లాగే 2026లో కూడా కొందరు అంతర్జాతీయ స్టార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ మొదటి మ్యాచ్ ఆడబోతున్నారు. 2026లో ఐపీఎల్ అరంగేట్రం చేయబోతున్న విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే.

పథుమ్ నిస్సంక

గత 3-4 ఏళ్లలో శ్రీలంకకు అత్యంత నమ్మకమైన బ్యాటర్లలో ఒకరిగా పథుమ్ నిస్సంక ఎదిగారు. ఆయన IPL 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నారు. మినీ వేలంలో ఢిల్లీ టీమ్ ఆయనను రూ. 4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది.

ఫిన్ అలెన్

న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ 2026 టీ20 వరల్డ్ కప్‌లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఆయన కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నారు. కేకేఆర్ ఆయనపై రూ. 2 కోట్ల వేలం పాట వేసింది. అలెన్ గతంలో ఆర్‌సీబీ (RCB) జట్టులో ఉన్నప్పటికీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.

Also Read: మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

బెన్ డకెట్

ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నారు. వేలంలో ఢిల్లీ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. బెన్ డకెట్ తన 217 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 5,397 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ కూడా 140 కంటే ఎక్కువగా ఉంది.

బ్లెస్సింగ్ ముజరబానీ

జింబాబ్వేకు చెందిన ఆరున్నర అడుగుల ఎత్తున్న బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ముజరబానీ 2026 టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 13 వికెట్లు తీసి ఐపీఎల్‌లోకి వస్తున్నాడు.

అల్లా గజన్ఫర్

‘మిస్టరీ స్పిన్నర్’ అని పిలవబడే ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల బౌలర్ అల్లా గజన్ఫర్‌ను ముంబై ఇండియన్స్ వేలంలో రూ. 4.80 కోట్లకు కొనుగోలు చేసింది. అల్లా తన 63 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో 77 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పరుగుల వేగాన్ని నియంత్రించడంలో మంచి పట్టు ఉంది.

జాక్ ఎడ్వర్డ్స్

25 ఏళ్ల ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ IPL 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఆడనున్నాడు. వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ ఎడ్వ‌ర్డ్స్‌పై రూ. 3 కోట్ల భారీ ధరను వెచ్చించింది. ఎడ్వర్డ్స్ తన టీ20 కెరీర్‌లో 853 పరుగులు చేయడంతో పాటు, మీడియం పేస్ బౌలింగ్‌తో 52 వికెట్లు కూడా తీశాడు.

జాకబ్ డఫీ

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ గత రెండేళ్లలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. ఆర్‌సీబీ (RCB) రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. డఫీ గత ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు పడగొట్టాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Finn Allen
  • IPL 2026
  • IPL debut
  • Jacob Duffy
  • Muzarabani
  • sports news

Related News

CSK

సీఎస్కే జ‌ట్టులో భారీ మార్పు..!

ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ ఫోస్టర్ IPL 2026లో తమ ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటారని CSK అధికారికంగా వెల్లడించింది.

  • West Indies

    వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

  • Ishan Kishan

    స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

  • Punjab Kings

    పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

  • Harshit Rana

    ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

Latest News

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

  • ఐపీఎల్ తొలిసారి ఆడ‌నున్న‌ విదేశీ ఆటగాళ్ల జాబితా ఇదే!

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd