Lasith Malinga Birthday: యార్కర్ కింగ్ లసిత్ మలింగ బర్తడే స్పెషల్
మలింగ తన ఆట ఆధారంగా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.లసిత్ మలింగ గాలే సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తన స్నేహితులతో కలిసి ఇసుకలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అప్పట్లో టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడేవాడు. అతని తండ్రి బస్ మెకానిక్ గా పని చేసేవారు, ఆర్థిక సమస్యలున్నప్పటికీ తన కొడుకు కలను నెరవేర్చవడానికి కృషి చేశాడు. లసిత్ మలింగ 17 ఏళ్ల వయసులో తొలిసారి లెదర్ బాల్ తో ఆడాడు
- By Praveen Aluthuru Published Date - 04:25 PM, Wed - 28 August 24

Lasith Malinga Birthday: ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు సెపెరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. సచిన్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్, జహీర్, ధోనీ కోహ్లీ, రోహిత్ ఇలా కొందరు తమ తమ అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. అయితే ముత్తయ్య మురళీధరన్, మలింగా లాంటి వ్యక్తులు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు.
సచిన్ హయాంలో ముత్తయ్య, ధోనీ హయాంలో మలింగా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మలింగా 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. లసిత్ మలింగ యార్కర్ ముందు ఎంతటి విధ్వంసకారులైన కాస్త వెనకడుగు వేయాల్సిందే. విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఇలా అందరూ మలింగతో తలపడాలంటే ఆలోచించేవాళ్ళు. లసిత్ మలింగ సచిన్‌ను 6 సార్లు అవుట్ చేసాడు, ఎంఎస్ ధోనిని ఐదుసార్లు, రోహిత్‌ని 3 సార్లు మరియు కింగ్ కోహ్లీని రెండుసార్లు బలిపశువుగా చేసాడు.
మలింగ తన ఆట ఆధారంగా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.లసిత్ మలింగ గాలే సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తన స్నేహితులతో కలిసి ఇసుకలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అప్పట్లో టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడేవాడు. అతని తండ్రి బస్ మెకానిక్ గా పని చేసేవారు, ఆర్థిక సమస్యలున్నప్పటికీ తన కొడుకు కలను నెరవేర్చవడానికి కృషి చేశాడు. లసిత్ మలింగ 17 ఏళ్ల వయసులో తొలిసారి లెదర్ బాల్ తో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించిన ఏకైక ఆటగాడు లసిత్ మలింగ. 2007 ప్రపంచకప్‌తో పాటు, 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లోనూ అతను ఈ ఫీట్‌ను పునరావృతం చేశాడు.
శ్రీలంక తరఫున 226 వన్డేల్లో మలింగ 338 వికెట్లు పడగొట్టాడు. టెస్టులో 101 వికెట్లు తీశాడు. 2009 నుండి ఐపీఎల్ ఆడిన మలింగ తన కెరీర్‌లో మొత్తం 112 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.170 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో అతని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 15 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు బ్యాట్ తో రాణించాడు. ఈ క్రమంలో 88 పరుగులు చేశాడు. మలింగ లవ్ స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను మొదట తన భార్య తాన్యా పెరీరాను ఒక ప్రకటనలో కలుసుకున్నాడు. మలింగ మొదటి చూపులోనే తాన్యతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ 1 సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు, ఆ తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. మలింగ 2010 జనవరి 22న తాన్యను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని నికర విలువ 80 కోట్లకు పైగా ఉంది.
Also Read: Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్‌గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ