HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Krunal Pandya Wins The Ipl Title For The Fifth Time

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Author : Vamsi Chowdary Korata Date : 02-06-2026 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krunal Pandya wins the IPL title for the fifth time.
Krunal Pandya wins the IPL title for the fifth time.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు.

దిగ్గజాల సరసన కృనాల్
ఐపీఎల్ లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఆటగాళ్లుగా రోహిత్ శర్మ, అంబటి రాయుడు (చెరో 6 టైటిళ్లు) అగ్రస్థానంలో ఉన్నారు. వీరి తర్వాత ఐదు టైటిళ్లతో ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇప్పుడు కృనాల్ పాండ్యా కూడా ఈ జాబితాలో చేరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ 2017, 2019, 2020లో మూడు టైటిళ్లు గెలిచిన కృనాల్, 2025లో ఆర్సీబీ జట్టులోకి వచ్చాక ఆ జట్టుకు వరుసగా రెండు టైటిళ్లు (2025, 2026) అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఆర్సీబీకి కీలక ఆటగాడిగా..
ఒకప్పుడు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కృనాల్, 2025లో ఆర్సీబీకి మారడం అతని కెరీర్ కు, జట్టుకు కూడా కలిసొచ్చింది. 2025 ఫైనల్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచిన అతను, 2026 సీజన్ లోనూ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ లో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు పడగొట్టి జట్టు టైటిల్ నిలబెట్టుకోవడంలో సహాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.

మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా తన ఆనందాన్ని పంచుకున్నాడు. “ప్రతి ఐపీఎల్ ట్రోఫీ ప్రత్యేకమైనదే. ఇది పిల్లలకు జన్మనిచ్చినట్టుగా ఉంటుంది, ఎవరినీ ఎంచుకోలేం… దేనికదే ప్రత్యేకం. 11 ఏళ్ల కెరీర్ లో ఐదు టైటిళ్లు గెలవడం నాకు చాలా స్పెషల్” అని అన్నాడు. కష్టకాలంలోనూ జట్టుకు అండగా నిలిచిన ఆర్సీబీ అభిమానులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Five IPL Titles
  • IPL 2026
  • Krunal Pandya
  • Royal Challegers Bengaluru
  • sports news

Related News

RCB FANS

HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. దీంతో పోలీసులు అభిమానుల‌పై లాఠీ ఝులిపించారు. ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ జట్టు విజయంతో అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి గుమిగూడారు. ఈ సంబరాల సమయంలో, అభిమానులు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిం

  • Vaibhav

    IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

  • GT

    GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • RCB

    RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd