Virat Kohli: కోహ్లీ జీరో బాల్ వికెట్
పంచ క్రికెట్ చరిత్రలో కోహ్లీ పేరు ప్రధానంగా వినబడుతుంది. సైలెంట్ గా వచ్చి టీమిండియాలో రారాజుగా ఎదిగాడు
- Author : Praveen Aluthuru
Date : 20-07-2023 - 5:24 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: ప్రపంచ క్రికెట్ చరిత్రలో కోహ్లీ పేరు ప్రధానంగా వినబడుతుంది. సైలెంట్ గా వచ్చి టీమిండియాలో రారాజుగా ఎదిగాడు. పిన్న వయసులోనే జట్టు పగ్గాలు చేపట్టి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఫార్మెట్ తో పని లేకుండా రెడ్ బాల్ సిరీస్ లోనూ దూకుడుగా ఆడుతూ సెన్సేషన్ క్రియేట్ చేయగల సమర్ధుడు. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటుంది. కోహ్లీ తన క్రికెట్ కెరీర్లో వేసిన మొదటి ఓవర్లో డేంజరస్ బ్యాట్స్ మెన్ ని అవుట్ చేసిన సంగతి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే బాల్ వేయకుండానే వికెట్ తీసి అరుదైన రికార్డ్ తన పేరిట లికించుకున్నాడు. 2011లో జరిగిన ఓ ఘటన కోహ్లీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది.
2011లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు మాంచెస్టర్‌లో జరిగినటీ 20లో ఆతిథ్య జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 165 పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ లో అజింక్య రహానే 39 బంతుల్లో 61 పరుగులతో ఆకట్టుకోగా, సురేశ్ రైనా 19 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కెవిన్ పీటర్సన్ 22 బంతుల్లో 33 పరుగులు చేసి ప్రమాదకరంగా మారాడు. దీంతో కెప్టెన్ ధోనీ 8వ ఓవర్‌లో విరాట్ కోహ్లీని రంగంలోకి దింపాడు.
ధోనీ తీసుకున్న నిర్ణయానికి అందరు అవాక్కయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీకి బౌలింగ్ ఇవ్వడమేంటని ఆశ్చర్యపోయారు. కానీ అప్పుడు ధోనీ సరైన నిర్ణయమే తీసుకున్నాడు. కోహ్లీ తన కెరీర్లో ఫస్ట్ ఓవర్ వెయ్యడం అదే తొలిసారి. ఓ వైపు పీటర్సన్ ఫామ్ లో ఉండగా, కోహ్లీ ఎలా బౌలింగ్ చేస్తాడోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కోహ్లీ నుంచి డెలివరీ అయిన తొలి బంతి వైడ్ గా మారడంతో ఆ బంతిని సిక్సర్ గా మలిచే క్రమంలో పీటర్సన్ క్రీజును ధాటాడు. కళ్ళు తెరిచి చూసేలోపే ధోనీ స్టంప్స్ గిరాటేశాడు. దాంతో జీరో బాల్‌కే వికెట్ తీసిన ఘనత విరాట్ ఖాతాలో పడింది.
Also Read: Minister Errabelli: వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి