Minister Errabelli: వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
- Author : Balu J
Date : 20-07-2023 - 4:37 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ తరుణంలో గత 24 గంటలల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఐదు జిల్లాల ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సిపి, ఎస్పీ, ఇతర అధికారులతో రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్త చార్యలను ఆ జిల్లాల కలెక్టర్లు మంత్రులు ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి, ఇతర ప్రజా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్, ఆరంజ్ అలెర్ట్ వుందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వెంటనే అధికారులకు తెలియచేయాలని, అలాగే తగిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను ఎమ్మేల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ సమయంలో ఏ సమస్య వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండి సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
అలాగే జిల్లా కలెక్టరేట్ల లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.