Kohli: చేతికి కుట్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఇది కదా అసలు సిసలు మజా!
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌గా ఉన్నాడు. యువ స్టార్ క్రికెటర్లు ఎందరో కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటున్నారు
- By Anshu Published Date - 08:30 PM, Thu - 30 March 23

Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌గా ఉన్నాడు. యువ స్టార్ క్రికెటర్లు ఎందరో కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటున్నారు. ఇతర దేశాల యువ క్రికెటర్లు కూడా కోహ్లీకి ఫ్యాన్స్ అయిపోయారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌తో పాటు ఇతర దేశాల స్టార్ క్రికెటర్లలో కూడా కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
అయితే కోహ్లీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ పట్ల ఎంత కమిట్‌మెంట్ ఉందో తాజాగా ఓ విషయం ద్వారా బయటపడింది. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ ఆడుతున్నాడు. అయితే కోహ్లీ ఆర్సీబీతో 15 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను విడుదల చేసింది. కోహ్లీతో కలిసి ఆడిన ఆటగాళ్లు, కోచ్‌లతో మాట్లాడించిన ఓ వీడియోను బయటపెట్టింది. ఇందులో ఒళ్లు గగుర్పొడిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.
2016 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతికి కుట్లు పడినా కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బాంగర్ రివీల్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడని, చేతికి 9 కుట్లు పడినా బ్యాటింగ్ చేశాడని అన్నాడు. నొప్పి పుడుతున్నా ఆ బాధను దిగమింగుకుని టీమ్ కోసం ఆడాడని, కోహ్లీ కమిట్‌మెంట్, అంకితభావం ఎలా ఉంటుందో దీని ద్వారా తెలుస్తుందని అన్నాడు. క్రికెట్ పట్ల కోహ్లీని ఉన్న ఇష్టం ఎలాంటిదో ఇది ఒక్క ఉదాహరణతో అర్థం అవుతుందని చెప్పాడు.
వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 211 పరుగులు చేసింది. కోహ్లీ 50 బంతుల్లో 113 పరుగులు చేవాడు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది.