HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kohli Says To Play Like Test Cricket For A While Kl Rahul

KL Rahul: టెస్టు క్రికెట్‌ ఆడాలని కోహ్లీ చెప్పాడు, నేను అదే ఫాలో అయ్యా: కేఎల్ రాహుల్

ఫోర్లు, సిక్స్ లు బాదడమే కాదు.. అవసరమైతే సింగిల్స్ తీయాలి. అప్పుడే మ్యాచ్ పై పట్టు బిగించలం.

  • By Balu J Published Date - 02:50 PM, Mon - 9 October 23
  • daily-hunt
KL Rahul
KL Rahul

KL Rahul: ఏ ఆటలోనైనా పరిస్థితులను అంచనా వేస్తు ఆడటం చాలా ముఖ్యం. ఇక క్రికెట్ లో చాలా ముఖ్యం. ఫోర్లు, సిక్స్ లు బాదడమే కాదు.. అవసరమైతే సింగిల్స్ తీయాలి. అప్పుడే మ్యాచ్ పై పట్టు బిగించలం. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ అందుకు ఉదాహారణ. ఒక దశలో భారత్ 2 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు జట్టును ఆదుకున్నారు. ఆదుకోవడమే కాదు టీమిండియాను గెలిపించారు కూడా.

విరాట్ కోహ్లీకి కింగ్ అనే పేరుంది. ఇప్పటికే ఆ పేరుకు తగ్గ ఆటను కూడా ప్రదర్శించాడు. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన పోరులో భారత్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఇక మరోసారి కోహ్లీ టీమిండియా పాలిట దేవుడిలా నిలిచాడు. పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో జట్టుకు అండగా నిలిచాడు. 12 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను మిచెల్ మార్ష్ నేలపాలు చేయడంతో బతికిపోయిన కోహ్లీ. ఆ తర్వాత విజృంభించాడు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీతో సమానంగా రాహుల్ రాణించాడు. ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా చూడచ్చని ఆటతీరులో అలరించి మ్యాచ్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తను ఇంత పట్టుదలగా ఆడటానికి కారణం విరాట్ కోహ్లీనే అని రాహుల్ చెప్పాడు. ‘రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చినప్పుడు నేను, కోహ్లీ పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. వికెట్ కీపింగ్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి విశ్రాంతి తీసుకుందామని అనుకున్నా.

ఆ టైం కూడా నాకు దొరకలేదు’ అని రాహుల్ అన్నాడు. ‘అప్పుడు విరాట్ నాతో.. ఇక్కడ వికెట్ బౌలర్లకు సహకరిస్తోంది. కాబట్టి కాసేపు టెస్టు క్రికెట్‌లా ఆడు. పేసర్లకు కొంచెం హెల్ప్ ఉంది. ఆ తర్వాత స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారు అని సలహా ఇచ్చాడు. నేను అదే ఫాలో అయ్యా’ అని రాహుల్ వెల్లడించాడు. ఆ తర్వాత కొంచెం మంచు రాగానే బ్యాటింగ్ చేయడం సులభమైందని చెప్పుకొచ్చాడు. ‘చివరి 15-20 ఓవర్లలో మంచు బాగా ప్రభావం చూపించింది. అది మాకు బాగా కలిసొచ్చింది. అయితే ఈ పిచ్ రెండు వైపులా బౌలర్లకు సహకారం ఇచ్చింది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు’’ అని రాహుల్ అన్నాడు.

Also Read: MLC Kavitha: ముగిసిన కవిత లండన్ పర్యటన, బ్యాక్ టు హైదరాబాద్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 World Cup
  • IND vs AUS
  • KL Rahul
  • virat kohli

Related News

Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు!

ఈ జాబితాలో విరాట్ కోహ్లి (30 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (28 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (26 సిక్సర్లు) వంటి దిగ్గజాలు ఉన్నారు. వీరందరినీ దాటి సూర్య అగ్రస్థానాన్ని దక్కించుకోవడం అతని బ్యాటింగ్‌లోని మెరుపును స్పష్టం చేస్తుంది.

  • Sanju Samson

    Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • IND vs AUS

    IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

  • Virat Kohli- Rohit Sharma

    Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Virat Kohli Net Worth 2025

    Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

Latest News

  • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

  • Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

  • Maganti Sunitha: మాగంటి సునీత‌కు కేటీఆర్ మద్దతు వెనక రియల్ లైఫ్ డ్రామా?

  • Honey : తేనె ఎక్కువగా స్వీకరిస్తున్నారా..? అయితే జాగ్రత్త !!

  • Reliance : క్షమాపణలు చెప్పిన రిలయన్స్, స్కోడా.. ఎందుకంటే?

Trending News

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd