KL Rahul: లంకతో సీరీస్ కు కేఎల్ రాహుల్ దూరం.. కారణం అదే
టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ శ్రీలంకతో సీరీస్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
- By Naresh Kumar Published Date - 11:21 AM, Thu - 1 December 22
టీమిండియా ఓపెనర్ కే ఎల్ రాహుల్ శ్రీలంకతో సీరీస్ కు దూరమయ్యే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో రాహుల్ పెళ్లి చేసుకోనుండడమే దీనికి కారణం. నిజానికి వరల్డ్ కప్ కు ముందే రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టిని వివాహం చేసుకుంటాడని భావించినా.. వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నాడు. అయితే మెగా టోర్నీ ముగిసిన తర్వాత పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో సెలవు కావాలని కోరడంతో రాహుల్ ను సెలెక్టర్లు కివీస్ టూర్ కు ఎంపిక చేయలేదు. ఆ తర్వాత పలు ఆలయాలు కూడా దర్శించుకున్న రాహుల్ ఇప్పుడు లంకతో జరిగే వన్డే , టీ ట్వంటీ సీరీస్ ల నుంచి రెస్ట్ తీసుకోనున్నాడు. జనవరిలోనే అతీయాతో వివాహ బంధంలోకి అడుగు పెట్టడం ఖాయం అయినట్టే. దీనిపై త్వరలోనే రాహుల్ , అతీయా అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టితో రాహుల్ 2018 నుంచీ డేటింగ్ లో ఉన్నాడు. పలు సందర్భాల్లో ఇద్దరూ టూర్ లకు కూడా వెళ్ళారు. సర్జరీ కోసం రాహుల్ జర్మనీ వెళ్ళినప్పుడు కూడా అతియా అతని వెంటే ఉండి బాగోగులు చూసుకుంది. దీంతో వీరిద్దరి లవ్ స్టోరీపై క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కేఎల్ రాహుల్ తల్లిదండ్రులు అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టిని కలవడంతో మ్యారేజ్ కొత్త ఏడాదిలో ఉంటుందని తేలిపోయింది. రెండు కుటుంబాలు కలిసి రాహుల్-అతియా జంట పెళ్లి తర్వాత ఉండబోయే కొత్త ఇంటిని సందర్శంచారని, అక్కడే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేయాలని వారు నిర్ణయించారని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Related News
KL Rahul: లక్నోకు బిగ్ షాక్.. జట్టును వీడనున్న కేఎల్ రాహుల్..?
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా ముఖ్యాంశాలలో ఉన్నారు.