Josh Hazlewood: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేపర్ దూరం
2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు పింక్ బాల్ టెస్టు ఆడాయి. ఇందులో హేజిల్‌వుడ్ 5 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
- By Gopichand Published Date - 09:04 PM, Sun - 1 December 24

Josh Hazlewood: తొలి టెస్టులో ఓటమితో కంగుతిన్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోస్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) రెండో టెస్టుకు దూరమయ్యాడు. హేజిల్‌వుడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే నాలుగు వికెట్లు తీశాడు. ఇందులో విరాట్ కోహ్లీ వికెట్ కూడా ఉండటం గమనార్హం. రెండో మ్యాచులో 21 ఓవర్లలో కేవలం 28 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియాకు హేజిల్‌వుడ్ దూరమవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. భారత్‌తో డే నైట్ టెస్టులో అతడికి మెరుగైన రికార్డు ఉంది.
2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు పింక్ బాల్ టెస్టు ఆడాయి. ఇందులో హేజిల్‌వుడ్ 5 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఇప్పుడు వుడ్ లేకపోవడం ద్వారా ఆసీస్ తమ ప్రణాళికల్ని మార్చక తప్పదు. అయితే హేజిల్‌వుడ్ గైర్హాజరీతో కొత్తగా ఇద్దరికి స్క్వాడ్‌లో చోటు దక్కింది. సీన్ అబాట్, డొగ్గెట్‌ను ఎంపిక చేసింది. దీంతో పాటు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టులో ఉన్న బోలాండ్‌కు కూడా అవకాశం ఉంది.
Also Read: Shubman Gill: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్.. తుది జట్టుపై ఆందోళన
ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ లో అతడు బాగా రాణిస్తే.. భారత్‌తో రెండో టెస్టులో ఆసీస్ తుది జట్టులో అతను ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గాయంతో బాధపడుతున్న హేజిల్‌వుడ్ కేవలం రెండో టెస్టుకు మాత్రమే దూరమవుతాడా లేదా సిరీస్‌లో మరిన్ని మ్యాచులకు కూడా దూరమవుతాడా అనేది తేలాల్సి ఉంది. ఇక తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భావిస్తోంది.
అటు ఆస్ట్రేలియా కూడా బలమైన పునరాగమనం చేసి అడిలైడ్‌లోకి ప్రవేశించాలనుకుంటోంది. రెండో టెస్టు ద్వారా రోహిత్, గిల్ ఎంట్రీ ఇస్తుండటం టీమిండియాకు కలిసొస్తుంది. మరోవైపు హాజిల్‌వుడ్ నిష్క్రమణ ఆసీస్ జట్టు బలాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు అతను లేకుండా భారత్‌ను ఓడించడం ఆస్ట్రేలియాకు సవాలుగా మారనుంది.