Jai Shah : ఐసీసీ నూతన ఛైర్మన్ గా జై షా
ఇక ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30తో పదవీ కాలం ముగుస్తుంది
- By Sudheer Published Date - 08:25 PM, Tue - 27 August 24

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నూతన ఛైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా (Jai Shah) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 30తో ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ (Greg Barclay
) పదవీకాలం ముగియనుంది. మరోసారి ఈ పదవి చేపట్టేందుకు ఆయన విముఖత చూపారు. దీంతో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జైషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడిగా జై షా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటినుంచి రాజకీయాలకు దూరంగా వచ్చిన షా..ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30తో పదవీ కాలం ముగుస్తుంది. అయితే జైషా ఈ పదవికి పోటీచేయాలని ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడం తో షా కూడా సుముఖం వ్యక్తం చేసారు. ఈ సారి ఎన్నికల ప్రక్రియ లేకుండా జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ బోర్డులో 16 మంది సభ్యులుంటారు. వారిలో 15 మంది సభ్యుల మద్దతు జైషాకే ఇచ్చారు. ఐసీసీ అంటే అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణ సంస్థ. ఇప్పటిదాకా భారత్ తరపున నలుగురు ఈ పదవిని నిర్వహించారు. ఎన్.శ్రీనివాసన్, జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్ ఇప్పటిదాకా భారత దేశంనుంచి ఐసీసీ చైర్మన్ పదవిని అలంకరించారు. ఇప్పుడు జైషా ఐదవ భారతీయ వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.
ఐసీసీ రూల్స్ ప్రకారం ఐసీసీ చైర్మన్ గా మూడుసార్లు పోటీ పడొచ్చు. అయితే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు గ్రెగ్ బార్‌క్లే … రెండు సార్లు తన పదవి కాలాన్ని పూర్తి చేశాడు. మూడోసారి కూడా పోటీ చేసేందుకు గ్రెగ్‌కు అవకాశం ఉంది. కానీ గ్రెగ్ బార్‌క్లే ఇంట్రస్ట్ చూపించలేదు. తాను మరోసారి ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేయాలని అనుకోవడం లేదని బార్ క్లే స్పష్టం చేశారు. ఈ దఫా పదవీకాలం పూర్తయిన తరువాత మరోసారి బరిలోకి దిగబోనని తేల్చి చెప్పారు. బార్ క్లే ప్రకటనతో ఇక ఐసీసీ పీఠం షా కు దక్కింది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..