Allu Arjun : అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు. గతాన్ని మర్చిపోయి మాట్లాడితే..
- By News Desk Published Date - 08:00 PM, Tue - 27 August 24

Allu Arjun : టాలీవుడ్ లో మెగా వెర్సస్ అల్లు వివాదం మరింత ముదురుతోంది. ఎప్పటి నుంచో నడుస్తూ వస్తున్న ఈ వివాదం.. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేకి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో మరింత తీవ్రత అయ్యింది. వైసీపీ పై పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరోలంతా ప్రచారంలోకి దిగి కష్టపడుతుంటే.. వారికీ వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతు తెలపడం మెగా అభిమానులకు, జనసైనికులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విమర్శలు కేవలం అభిమానులతో ఆగిపోలేదు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం అల్లు అర్జున్ ని విమర్శిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. “అల్లుఅర్జున్ కి ఫ్యాన్స్ ఎవరు లేరు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు అని ఊహించుకుంటున్నాడు. ఆయనకి ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఎదిగిన అల్లు అర్జున్ తన స్థాయి నీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అల్లుఅర్జున్ జనసేనకి సపోర్ట్ చేసిన ఒకటే
చేయకపోయినా ఒకటే. మేం 21 సీట్లు గెలిచాం. అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళిన ఒక్క సీటు ఓడిపోయింది. ఆయన తండ్రిని కూడా ఎంపీగా గెలిపించుకోలేకపోయాడు” అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Bolisetty Srinivas, Janasena MLA from Tadepalligudem :
“అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నాకు తెలీదు.. ఉన్నది మెగా ఫ్యాన్స్.#AlluArjun కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదు. ఆయన ఉహించుకుంటున్నాడేమో ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు.
నువ్వు వస్తే ఏంటి రాకపోతే… pic.twitter.com/CkxmOQ3WeK
— Gulte (@GulteOfficial) August 27, 2024
దీంతో ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై పలువురు పలు కామెంట్స్ చేస్తుండడంతో.. బొలిశెట్టి రియాక్ట్ అవుతూ ఒక ట్వీట్ కూడా చేశారు. “నా వాక్యాలు పూర్తిగా వ్యక్తిగతం. ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా. చిరంజీవి గారిని కానీ, నాగబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వచ్చి వాళ్ళకి సరైన సమాధానం ఇస్తా. గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా” అంటూ ఒక ఘాటు ట్వీట్ కూడా చేశారు.
“నాకు ఇష్టమైతే నేను వస్తా” – ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారిని కానీ, నాగబాబు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కశ్చితంగా వస్తా!
మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమనగా.. నా వాక్యాలు పూర్తిగా… https://t.co/C4ZaKD3NGY
— Bolisetti Srinivas (@BolisettiSrinu) August 27, 2024