HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jammu Kashmir Cricketer Farid Hussain Passed Away

Jammu Kashmir Cricketer: అనుకోని ప్ర‌మాదం.. యువ క్రికెట‌ర్ క‌న్నుమూత‌!

ఫరీద్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభ, క్రీడపై ఆయనకున్న అంకితభావం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాయి.

  • Author : Gopi Date : 25-08-2025 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akash Choudhary
Akash Choudhary

Jammu Kashmir Cricketer: ఆసియా కప్ 2025 కోసం క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో క్రికెట్ ప్రపంచానికి ఒక విషాదకరమైన వార్త అందింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన యువ, ప్రతిభావంతుడైన క్రికెటర్ (Jammu Kashmir Cricketer) ఫరీద్ హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన రాష్ట్ర క్రికెట్ సంఘంతో పాటు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రమాదం జరిగిన తీరు

ఈ విషాదకర ఘటన ఆగస్టు 20న జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం.. ఫరీద్ హుస్సేన్ తన స్కూటర్‌పై వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక కారు డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. దీనిని ఊహించని ఫరీద్, ఆ డోర్‌ను బలంగా ఢీకొని రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్పృహ కోల్పోయారు.

స్థానికులు గమనించి వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ తలకు తీవ్రంగా తగలడం వల్ల యుక క్రికెట‌ర్ కోలుకోలేకపోయారు. చివరకు శనివారం (ఆగస్టు 23న) ఫరీద్ హుస్సేన్ తుది శ్వాస విడిచారు.

Also Read: Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు

వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్

ఈ ప్రమాద ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఫుటేజీలో కారు డోర్ ఎలా అకస్మాత్తుగా తెరుచుకుంది. ఫరీద్ ఎలా ఢీకొని కిందపడ్డారనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. ఇది చూసిన క్రీడాభిమానులు, ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రాష్ట్రానికి తీరని లోటు

ఫరీద్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభ, క్రీడపై ఆయనకున్న అంకితభావం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన అకాల మరణం జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌కు తీరని లోటు. రాష్ట్ర క్రికెట్ సంఘం, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు ఫరీద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Farid Hussain
  • Farid Hussain Passed Away
  • Jammu Kashmir Cricketer
  • passed away
  • road accident

Related News

Tragic accident in the US: Young woman from NTR district dies.

Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జులై 5న చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd