IPL Winners List: ఐపీఎల్‌లో ఇప్పటివరకు ట్రోఫీ గెలిచిన జట్లు ఇవే.. 2008 నుంచి 2024 వరకు లిస్ట్!
ఐపీఎల్ 2025 ముందు ఆర్‌సీబీ మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఆర్‌సీబీ 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరుకుంది.
- By Gopichand Published Date - 03:57 PM, Mon - 2 June 25

IPL Winners List: ఈ సారి కొత్త ఐపీఎల్ ఛాంపియన్ జట్టు మనకు లభిస్తుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2008 నుండి ఆడుతున్న పంజాబ్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. ఈ రెండు జట్లు జూన్ 3న నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ (IPL Winners List) ఆడనున్నాయి. 2008 నుండి ఇప్పటి వరకు ప్రతి సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్ అయింది? ఏ జట్టు రన్నర్-అప్ అయింది అనే సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్లు. రెండు జట్లు చెరో ఐదు సార్లు ట్రోఫీలు గెలిచాయి. కానీ ఐపీఎల్ 2025 ఫైనల్‌లో లేవు. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచి ప్లేఆఫ్ రేస్ నుండి తొలగిన మొదటి జట్టుగా నిలిచింది. ముంబై ఇండియన్స్ నాల్గవ స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. అయితే, క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.
Also Read: Eatala Rajender : తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసింది: ఈటల రాజేందర్
ఐపీఎల్ విన్నర్ లిస్ట్ (2008 నుండి 2024 వరకు)
- ఐపీఎల్ 2008 విన్నర్: రాజస్థాన్ రాయల్స్
- ఐపీఎల్ 2009 విన్నర్: డెక్కన్ ఛార్జర్స్
- ఐపీఎల్ 2010 విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ 2011 విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ 2012 విన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్
- ఐపీఎల్ 2013 విన్నర్: ముంబై ఇండియన్స్
- ఐపీఎల్ 2014 విన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్
- ఐపీఎల్ 2015 విన్నర్: ముంబై ఇండియన్స్
- ఐపీఎల్ 2016 విన్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్
- ఐపీఎల్ 2017 విన్నర్: ముంబై ఇండియన్స్
- ఐపీఎల్ 2018 విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ 2019 విన్నర్: ముంబై ఇండియన్స్
- ఐపీఎల్ 2020 విన్నర్: ముంబై ఇండియన్స్
- ఐపీఎల్ 2021 విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ 2022 విన్నర్: గుజరాత్ టైటాన్స్
- ఐపీఎల్ 2023 విన్నర్: చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ 2024 విన్నర్: కోల్‌కతా నైట్ రైడర్స్
ప్రతి సీజన్‌లో ఐపీఎల్ రన్నర్-అప్
- 2008: చెన్నై సూపర్ కింగ్స్
- 2009: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 2010: ముంబై ఇండియన్స్
- 2011: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 2012: చెన్నై సూపర్ కింగ్స్
- 2013: చెన్నై సూపర్ కింగ్స్
- 2014: పంజాబ్ కింగ్స్
- 2015: చెన్నై సూపర్ కింగ్స్
- 2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 2017: రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్
- 2018: సన్‌రైజర్స్ హైదరాబాద్
- 2019: చెన్నై సూపర్ కింగ్స్
- 2020: ఢిల్లీ క్యాపిటల్స్
- 2021: కోల్‌కతా నైట్ రైడర్స్
- 2022: రాజస్థాన్ రాయల్స్
- 2023: గుజరాత్ టైటాన్స్
- 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు
ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు గెలిచిన రికార్డు సునీల్ నరైన్ పేరిట ఉంది. అతను మొత్తం 3 సార్లు (2012, 2018, 2014) ఈ అవార్డును గెలిచాడు.
అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన జట్టు
చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన జట్టు. వారు మొత్తం 10 ఫైనల్స్ ఆడారు. అందులో 5 గెలిచారు. 5 ఓడారు. ముంబై ఇండియన్స్ 6 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. అందులో కేవలం 1 సారి మాత్రమే ఓడిపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎన్ని సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది?
ఐపీఎల్ 2025 ముందు ఆర్‌సీబీ మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఆర్‌సీబీ 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరుకుంది.
పంజాబ్ కింగ్స్ ఎన్ని సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది?
ఐపీఎల్ 2025 ముందు పంజాబ్ కేవలం 1 సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. 2014లో వారు ఫైనల్‌లో కేకేఆర్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మొదటిసారి ఈ జట్టు మళ్లీ ఫైనల్ ఆడనుంది.