HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2026 Will Ms Dhoni Play Against Gujarat Titans Today

ఐపీఎల్ 2026.. నేడైనా ధోనీ మైదానంలోకి దిగుతాడా?

ముంబై- చెన్నై మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ధోనీ రాకపై స్పష్టతనిచ్చారు. ధోనీ కేవలం బ్యాటర్‌గా కాకుండా, వికెట్ కీపర్ బ్యాటర్‌గానే జట్టులోకి వస్తారని ఆయన తెలిపారు.

  • Author : Gopi Date : 26-04-2026 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS Dhoni
MS Dhoni

MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్‌లో అన్ని జట్లు ఇప్పటికే సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. టోర్నమెంట్ సగం దశ దాటినా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మైదానంలో కనిపించలేదు. ఈరోజు అంటే ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై తన ఎనిమిదవ లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులందరి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న ఈరోజు ధోనీ ఆడతారా? అని. ధోనీ ఫిట్‌నెస్‌కు సంబంధించి తాజా అప్‌డేట్స్ ఇప్పుడు చూద్దాం.

నేడు సీజన్‌లోని 37వ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ ముందే ధోనీ పునరాగమనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Also Read: ప్రేమ పేరుతో ట్రాప్‌.. రూ. 9 కోట్ల మోసం చేసిన అషు రెడ్డి

గుజరాత్‌పై ధోనీ ఆడతారా? మైకేల్ హస్సీ ఏమన్నారు?

ముంబై- చెన్నై మ్యాచ్ సందర్భంగా సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ ధోనీ రాకపై స్పష్టతనిచ్చారు. ధోనీ కేవలం బ్యాటర్‌గా కాకుండా, వికెట్ కీపర్ బ్యాటర్‌గానే జట్టులోకి వస్తారని ఆయన తెలిపారు. ధోనీ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇస్తూ.. రాబోయే కొన్ని మ్యాచ్‌ల్లో ధోనీ ఆడతారని మేము ఆశిస్తున్నాము. అయితే అతను మైదానంలో తన అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే దాదాపు 100 శాతం ఫిట్‌గా ఉండాలి అని హస్సీ పేర్కొన్నారు. అంతేకాకుండా అతని కోలుకునే ప్రక్రియ బాగుంది. ధోనీ వీలైనంత త్వరగా తిరిగి రావడానికి శ్రమిస్తున్నారు. అభిమానులు కూడా ఆయన్ని మైదానంలో చూడాలని ఆరాటపడుతున్నారు అని హస్సీ చెప్పుకొచ్చారు.

The OG Keepers Club 💛🫂#WhistlePodu #GTvCSK pic.twitter.com/qd5VzpEf3B

— Chennai Super Kings (@ChennaiIPL) April 25, 2026

ప్రాక్టీస్ వీడియోతో పెరిగిన ఆశలు

గుజరాత్‌తో జరిగే నేటి మ్యాచ్‌లో ధోనీ ఆడతారా లేదా అనే దానిపై చెన్నై ఫ్రాంచైజీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మరోవైపు ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో కూడా ఇటువంటి ప్రాక్టీస్ వీడియోలు వచ్చినప్పటికీ తాజా వీడియోలు అభిమానుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. మరి ఈరోజు చెపాక్ స్టేడియంలో ధోనీ మెరుపులు కనిపిస్తాయో లేదో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSK vs GT Match Preview
  • Dhoni Fitness Update
  • IPL 2026 Return
  • Michael Hussey
  • ms dhoni
  • sports news

Related News

Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd