HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2026 Sunrisers X Rcb In The First Match

IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srh Vs Rcb
Srh Vs Rcb

SRH vs RCB  ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచులో మార్చి 28 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఐపీఎల్ 2026లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఐపీఎల్ 2026 ప్రాథమిక షెడ్యూల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి నాలుగు మ్యాచులు ఉన్నాయి. ఇందులో ఏప్రిల్ 5న ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్ రైజర్స్ తలపడనుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలుత కేవలం 20 మ్యాచుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు.మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 దాకా తొలి విడత మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచులో తలపడనుంది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. షెడ్యూల్ ప్రకటించిన 20 మ్యాచులలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన మ్యాచులు 4 ఉన్నాయి. ఇందులో మూడు మ్యాచ్‌లో ఇతర వేదికలపై ఆడనుంది. ఒక్క మ్యాచ్ మాత్రం హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతుంది. ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ షెడ్యూల్ (మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు)..

మార్చి 28 – ఆర్సీబీ vs సన్‌రైజర్స్ (బెంగళూరు, రాత్రి 7.30 గంటలకు)

ఏప్రిల్ 2 – కోల్‌కతా vs సన్‌రైజర్స్‌ (కోల్‌కతా, రాత్రి 7.30 గంటలకు)

ఏప్రిల్‌ 5 – సన్‌రైజర్స్‌ vs లక్నో (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3.30 గంటలకు)

ఏప్రిల్ 11 – పంజాబ్ vs సన్‌రైజర్స్‌ (న్యూ చండీగర్‌, రాత్రి 7.30 గంటలకు)

కాగా 2024 సీజన్‌లో అదిరే ఆటతీరుతో సన్ రైజర్స్ ఫైనల్ చేరింది. కానీ కేకేఆర్ చేతిలో ఓడి.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి జరిగిన మినీ వేలంలో జట్టు కూర్పుపై ఫోకస్ చేసిన సన్ రైజర్స్.. ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ 2026 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు..

ప్యాట్ కమిన్స్(కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, సమరన్ రవిచంద్రన్, కామిందు మెండిస్,శివంగ్ కుమార్, హర్ష్ దూబే, నితీశ్ రెడ్డి, లియామ్ లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, బ్రైడన్ కేర్స్, ఈషన్ మలింగా, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, అమిత్ కుమార్, క్రైన్స్ ఫులెట్రా, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఓంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • IPL 2026
  • IPL 2026 Date
  • ipl 2026 match list
  • SRH
  • SRH vs RCB
  • SRH vs RCB Match
  • Sunrisers Hyderabad

Related News

Bcci Col Ck Nayudu Lifetime Achievement Award

బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

BCCI  భారత క్రికెట్‌కు చేసిన విశేష సేవలకుగాను మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ అత్యున్నత గౌరవం ఇవ్వనుంది. మార్చి 15న ఢిల్లీలో జరిగే నామన్ అవార్డ్స్ కార్యక్రమంలో కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ఆయనను సత్కరించనున్నారు. 16 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ద్రావిడ్ భారత్ తరఫున 509 మ్యాచ్‌లు ఆడి అద్భుత రికార్డులు నెలకొల్పారు. తర్వాత కోచ్‌గా కూడా టీమి

  • The Hundred Women 2026

    ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

  • IPL 2026

    ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

  • IPL 2026

    ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

Latest News

  • Aster – Quality Care Merger : ఆస్టర్ – క్వాలిటీ కేర్ విలీనం.. భారత ఆరోగ్య రంగంలో సరికొత్త శకం

  • మన శ‌రీరానికి రోజుకు ఎంత ప్రోటీన్ అవసరమో తెలుసా?

  • ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

  • విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

  • IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd