HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2025 Memes Hilarious Reactions From Srh Vs Kkr

SRH vs KKR: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది.. 300 పరుగులు వద్దులే అంటూ ట్రోల్స్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు IPL 2024 నుంచి భిన్నమైన శైలిలో కనిపించింది. జట్టు బలం ఇప్పుడు దాని బ్యాటింగ్ ఆర్డర్‌తో అంచనా వేస్తారు. ఈ జట్టు IPL చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కూడా గుర్తింపు పొందింది.

  • Author : Gopi Date : 04-04-2025 - 11:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SRH vs KKR
SRH vs KKR

SRH vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు IPL 2024 నుంచి భిన్నమైన శైలిలో కనిపించింది. జట్టు బలం ఇప్పుడు దాని బ్యాటింగ్ ఆర్డర్‌తో అంచనా వేస్తారు. ఈ జట్టు IPL చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కూడా గుర్తింపు పొందింది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ (SRH vs KKR) ఆర్‌సీబీపై IPLలో అత్యధిక స్కోరు 287 పరుగులు చేసింది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి ఈ జట్టు 300 పరుగుల మైలురాయిని కూడా అందుకోవచ్చని అనిపించింది. దీనిని కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఆశించారు.

సీజన్-18 మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 300 పరుగుల మైలురాయిని తాకగలదని బలంగా అనుకున్నారు ఫ్యాన్స్. అయితే ఈ మ్యాచ్ తర్వాత నుంచి పాట్ కమిన్స్ జట్టు నీరసంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌లలో ఈ జట్టు ఇప్పటివరకు కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. వరుసగా 3 మ్యాచ్‌లలో హైదరాబాద్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కేకేఆర్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో కావ్య మారన్ జట్టును ట్రోల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్

300 పరుగులు చేస్తామని కలలు కన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. బలమైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో చాలా దారుణమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ కూడా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 300 పరుగులు ఏమో కానీ కనీసం ప్రత్యర్థి జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని అయిన చేధించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Vijay Devarakonda: బాలీవుడ్‌పై హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నిరాశపరిచిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు

నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ బౌలర్ల ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దారుణంగా విఫలమైంది. మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 4 పరుగులు, అభిషేక్ శర్మ 2 పరుగులు, ఇషాన్ కిషన్ 2 పరుగులు, అనికేత్ వర్మ 6 పరుగులు చేసి ఔటయ్యారు. సన్‌రైజర్స్ తరపున హెన్రిక్ క్లాసెన్ అత్యధికంగా 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కమిందు మెండిస్ 27 పరుగులు చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2025
  • IPL 2025 Memes
  • kavya maran
  • pat cummins
  • SRH vs KKR
  • Sunrisers Hyderabad

Related News

League Stage Concludes: Who Will Face Whom, and When?

IPL 2026: ముగిసిన లీగ్ స్టేజ్.. ఎవ‌రితో ఎవ‌రు ఎప్పుడు త‌ల‌ప‌డ‌నున్నారంటే?

దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 లీగ్ సమరానికి తెరపడింది. ఎన్నో మలుపులు, అనూహ్య ఫలితాలతో రసవత్తరంగా సాగిన ఈ దశలో చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో గెలవడంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల ఆశలు గల్లంతయ్యాయి. లీగ్ దశ ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గ

  • SRH Owner Kavya Maran's Wedding

    Kavya Maran: SRH ఓనర్ కావ్య మారన్ పెళ్లి

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd