IPL 2024 Schedule: నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024 Schedule) 17వ ఎడిషన్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
- By Gopichand Published Date - 07:40 AM, Thu - 22 February 24

IPL 2024 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024 Schedule) 17వ ఎడిషన్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) CEO కాశీ విశ్వనాథన్ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. అయితే మార్చి 22 నుంచి టోర్నీని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా తెలిపారు. పూర్తి షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే దీనికి తెర తొలగిపోతుంది. అయితే ప్రారంభోత్సవానికి సంబంధించి కాశీ విశ్వనాథన్ పెద్ద అప్‌డేట్ ఇచ్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన తొలి మ్యాచ్ ఎక్కడ ఆడుతుందో..? ఎవరితో ఆడుతుందో స్పష్టంగా తెలియడం లేదని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ఐపిఎల్ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు చెప్పాడు. చెన్నై జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అని, అందుకే ఈ ప్రారంభ వేడుకలను నిర్వహించే అవకాశం వచ్చిందని చెప్పాడు.
Also Read: Yashasvi Jaiswal: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన యశస్వి.. ప్రస్తుతం ర్యాంక్ ఎంతంటే..?
ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడతారు?
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌ను మే 26న ఆడవచ్చని క్రిక్‌బజ్ తన నివేదికలో తెలియజేసింది. అయితే పూర్తి షెడ్యూల్ ఇంకా వెల్లడి కాలేదు. లోక్‌సభ ఎన్నికల కారణంగా దాని షెడ్యూల్ రెండు భాగాలుగా వస్తుందని చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. తొలి 15 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్నికల తేదీల ప్రకారం తదుపరి షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.
We’re now on WhatsApp : Click to Join
IPL 2024 షెడ్యూల్ ఎప్పుడు విడుదల అవుతుంది..?
IPL 2024 షెడ్యూల్‌కు సంబంధించి అది ఎప్పుడు వస్తుందో ఇంకా నిర్దిష్ట తేదీ తెలియదు. అయితే బుధవారం రాత్రి హఠాత్తుగా ఐపీఎల్ షెడ్యూల్ ఫిబ్రవరి 22వ తేదీన విడుదల కానుందని సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఫిబ్రవరి 22న సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు మొదలయ్యాయి. ఇందులో మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తారని జనాలు తెలిపారు. అయితే దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.