Hardik Pandya : పాండ్యాకు షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్ నెస్ క్యాంప్ నిర్వహించేందుకు సిద్దమయింది.
- By Naresh Kumar Published Date - 04:35 PM, Wed - 9 March 22

ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్ నెస్ క్యాంప్ నిర్వహించేందుకు సిద్దమయింది. అయితే గత కొంత కాలంగా ఫిట్ నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయిన పాండ్య ప్రస్తుతం ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీని కోసం తానే సొంతంగా ఫిట్ నెస్ మెరుగు పరుచుకునే పనిలో ఉన్నాడు. తాజాగా హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెలెక్టర్లు భారీ షాక్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రారంభం కానున్న బీసీసీఐ ఫిట్‌నెస్ క్యాంప్‌కు తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశించారు.
నిజానికి గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్య ఇటీవలే జాతీయ క్రికెట్ ఆకాడమికి వెళ్లనని పేర్కొన్నాడు. అయితే తాజాగా బీసీసీఐ సెలెక్టర్లు పాండ్యాను హెచ్చరిండంతో అతడు ఫిట్ నెస్ క్యాంప్ కోసం వెళ్లనున్నట్లు సమాచారం.ఐపీఎల్ క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. మెగా వేలంలో టీ20లకు కావాల్సిన అసలుసిసలైన జట్టును ఎంచుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను 15 కోట్ల రికార్డు ధర చెల్లించి గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పగించింది. మెగా వేలంలో ఫెర్గూసన్ ను10 కోట్లు, డేవిడ్ మిల్లర్ ను 3 కోట్లు, మాథ్యూ వేడ్ ను 2.4 కోట్లు, రాహుల్ తెవాతియా ను 9 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. మెగా వేలంలో 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.