Pant Captain:గాయంతో రాహుల్ ఔట్…కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా ?
సౌతాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లు సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.
- By Naresh Kumar Published Date - 01:32 PM, Thu - 9 June 22

సౌతాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు స్టాండిన్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లు సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. గురువారం తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇండియన్ టీమ్‌కు ఇది నిజంగా షాకింగ్ వార్తే. రాహుల్ దూరం కావడంతో అతని స్థానంలో బీసీసీఐ రిషబ్ పంత్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది.
ఇప్పటికే రోహిత్, కోహ్లి, బుమ్రాలాంటి సీనియర్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా రాహుల్ ను నియమించారు. ఐపీఎల్ లో రాహుల్ లక్నో జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. అతన్ని భవిష్యత్ కెప్టెన్ రేసులో కూడా ఒకరిగా భావిస్తున్నారు. దీంతో తన కెప్టెన్సీ సత్తా నిరూపించుకునేందుకు సఫారీ సీరీస్ రాహుల్ కు మంచి అవకాశంగా అనుకున్నారు. అయితే దురదష్టవశాత్తూ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స‌్థానంలో పంత్ కి కెప్టెన్సీ, హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇచ్చినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. రాహుల్ కుడి పిక్క గాయంతో దూరం కాగా.. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా కుల్ దీప్ యాదవ్ కుడి చేతికి గాయమయింది.
టీమ్‌తో కలిసి అతడు మూడు రోజులుగా ట్రైనింగ్ సెషన్‌లోనూ పాల్గొంటున్నాడు. అయితే సరిగ్గా తొలి టీ20కి ఒక రోజు ముందు రాహుల్ గాయం విషయం తెలిసింది. అతడు సిరీస్‌కు దూరం కావడం టీమ్‌కు చాలా పెద్ద దెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్‌లో అతడు టాప్ ఫామ్‌లో ఉన్నాడు. లీగ్‌లో 600కుపైగా రన్స్ చేశాడు. కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌ను ప్లేఆఫ్స్ వరకూ తీసుకెళ్లాడు. ఇప్పుడు రాహుల్ లేకపోవడంతో యువ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లు టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయనున్నారు. భారత్ , దక్షిణాఫ్రికా తొలి టీ ట్వంటీ గురువారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనుంది.