HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Indian Cricketer Shardul Thakur Marries Mittali Parulkar

Shardul Thakur: ముంబైలో ఘనంగా శార్దూల్ ఠాకూర్ వివాహం.. స్నేహితురాలినే పెళ్లాడిన క్రికెటర్

భారత జట్టు ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. శార్దూల్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం ముంబైలో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ మరాఠీ సంప్రదాయాలతో వివాహం చేసుకున్నారు.

  • Author : Gopi Date : 28-02-2023 - 1:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shardul Thakur
Resizeimagesize (1280 X 720) (2)

భారత జట్టు ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. శార్దూల్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం ముంబైలో వివాహం చేసుకున్నాడు. మరాఠీ సంప్రదాయాలతో వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు పెళ్లి చేసుకున్నారు. మొదట KL రాహుల్, అతియా శెట్టిల వివాహం జరిగింది. దీని తర్వాత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్- మేహాను వివాహం చేసుకున్నాడు.

Congratulations You Beautiful Couple Lord #Shardul Thakur and Mittali Parulkar pic.twitter.com/vKSUQjGgY1

— Lalit Tiwari (@lalitforweb) February 27, 2023

ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్, అతని స్నేహితురాలు మిథాలీ పారుల్కర్ 2021 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు. వారిద్దరికీ ముంబైలో నిశ్చితార్థం జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఇద్దరూ T20 వరల్డ్ తర్వాత 2022 సంవత్సరంలో వివాహం చేసుకోవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల తేదీని వాయిదా వేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 27న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Also Read: Air India: ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారా ఎయిర్‌లైన్స్

బంధువులు, స్నేహితులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. ముంబైలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య మాల్తీ చాహర్ కూడా వివాహ వేడుకలో కనిపించింది. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు అభిషేక్ నాయర్, ముంబై ప్లేయర్ సిద్ధేష్ లాడ్ కూడా శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. మిథాలీ పారుల్కర్ ది బేక్స్ పేరుతో బేకరీ ఫుడ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆల్ ది జాజ్ లగ్జరీ బేకర్స్ సంస్థ ద్వారా ముంబైలో వ్యాపారాలను నిర్వహిస్తోంది.

కాగా.. పెళ్లి కారణంగా శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్ కు శార్దూల్ జట్టులో చేరతాడని సమాచారం. మార్చి 1 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టు తర్వాత చాలా విరామం ఉంది. అందుకే రోహిత్ శర్మ స్వయంగా ఈ వివాహంలో భాగం అయ్యాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mithali Parullkar
  • mumbai
  • rohit sharma
  • Shardul Thakur
  • Team India player

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

  • IPL 2026

    Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd