IND vs ZIM: భారత్ లక్ష్యం 153 పరుగులు
భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.
- By Praveen Aluthuru Published Date - 06:33 PM, Sat - 13 July 24

IND vs ZIM: హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 153 పరుగులు చేయాలి.
భారత్-జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌లో భాగంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 152 స్కోరు సాధించింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శన చేశాడు. సికందర్ రజా 28 బంతుల్లో 46 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండేకి బలి అయ్యాడు.ఇన్నింగ్స్ లో అతను 2 ఫోర్లు మరియు 3 సిక్సర్లు కొట్టాడు. తడివానాశే మారుమణి 32, వెస్లీ మాధవెరె 25 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.
భారత బౌలర్ల ఫర్వాలేదనిపించారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అరంగేట్రం ఆటగాడు తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తరఫున తుషార్ దేశ్‌పాండేకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ టూర్‌లో అరంగేట్రం చేసిన 5వ ఆటగాడిగా తుషార్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.
జింబాబ్వేజట్టు: వెస్లీ మాధేవేర్, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే (వికెట్), రిచర్డ్ న్గర్వా, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా.
భారత్ జట్టు : యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.
Also Read: Jammu and Kashmir: జమ్మూలో 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు: 2 మృతి, 25 మందికి గాయాలు