Sanju Samson vs Rishabh Pant: ఈ ఇద్దరిలో ఎవరికీ జట్టులో ప్లేస్ ఇస్తారు..? గంభీర్ చూపు ఎవరివైపు..?
రిషబ్ పంత్, సంజు శాంసన్ (Sanju Samson vs Rishabh Pant) టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా 2024 T20 ప్రపంచ కప్‌లో ఆడారు.
- By Gopichand Published Date - 11:00 AM, Thu - 25 July 24

Sanju Samson vs Rishabh Pant: టీ20 సిరీస్‌తో భారత జట్టు శ్రీలంక పర్యటనను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ జూలై 27న జరగనుంది. దీనికి సంబంధించి గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు నెట్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సిరీస్‌తో టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌లో గంభీర్ ఏ వికెట్‌కీపర్‌కు అవకాశం ఇస్తాడన్నది పెద్ద ప్రశ్న. వికెట్ కీపర్ జాబితాలో ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.
ఎవరికి అవకాశం ఇస్తారు?
శ్రీలంక టూర్‌లో జరగనున్న టీ20 సిరీస్‌లో ఇద్దరు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లకు టీమిండియాలో అవకాశం లభించింది. అయితే ఈ ఇద్దరు వికెట్‌కీపర్‌లలో ఒకరు మాత్రమే ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడటం కనిపిస్తుంది. రిషబ్ పంత్, సంజు శాంసన్ (Sanju Samson vs Rishabh Pant) టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా 2024 T20 ప్రపంచ కప్‌లో ఆడారు. అయితే రిషబ్ పంత్‌కు మాత్రమే ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం లభించింది. అయితే సంజు మొత్తం టోర్నమెంట్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు.
Also Read: Financial Problems: ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు.. మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం!
సంజూ శాంసన్‌కు జట్టులో అవకాశం రావడం తరచుగా కనిపిస్తుంది. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో సంజుకు చాలా తక్కువ అవకాశం దక్కింది. తన చివరి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత కూడా సంజూ శ్రీలంక పర్యటన కోసం వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు మరోసారి సంజూ స్థానంలో పంత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కే అవకాశం ఉంది. పంత్‌కు అవకాశం వస్తే అతను 3వ నంబర్‌లో కూడా బ్యాటింగ్‌లో కనిపిస్తాడు. ఇది కాకుండా సంజు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, పంత్ ఎడమ చేతి బ్యాట్స్‌మన్. ఇటువంటి పరిస్థితిలో గౌతమ్ గంభీర్ ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌ని ఎంచుకోవచ్చని తెలుస్తోంది.
ఇకపోతే జూలై 27 నుంచి టీమిండియా.. శ్రీలంక జట్టుతో మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ ఆటగాళ్లను కూడా ప్రకటించాయి. ఇకపోతే టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు చూసుకోనున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.