HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Vs South Africa Dream Comeback For Dinesh Karthik

Ind Vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన, 3 ఏళ్ల తర్వాత దినేష్ కార్తీక్ కు స్థానం.!!

IND vs SA T20 Team:దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు నేడు ప్రకటించారు.

  • Author : Hashtag U Date : 23-05-2022 - 12:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dinesh Karthik Kkr Imresizer
Dinesh Karthik Kkr Imresizer

IND vs SA T20 Team:దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు నేడు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో తలపడే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్‌ రాహుల్‌కు అప్పగించారు. ఇది కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. అయితే అనూహ్యంగా దినేష్ కార్తీక్ ను టీమిండియా జట్టులోకి తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత దినేశ్ మరోసారి జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు సన్ రైజర్స్ తరపున ఆడుతున్న కాశ్మీరి ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా భారత టీ20 జట్టులో చోటు సంపాదించడం విశేషం.

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు దినేష్ కార్తీక్ తిరిగి జట్టులోకి తిరిగి రావడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఈ వెటరన్ ఆటగాడు 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్, అలాగే బ్యాట్స్ మెన్ గా రాణించిన దినేష్ కార్తీక్, దాదాపు ధోనీ కన్నా ముందే టీమిండియాలో స్థానం సంపాదించాడు. అయితే అటు వికెట్ కీపర్, స్పెషలిస్ట్ బ్యాట్స్ మాన్ గా ధోనీ స్థిరపడటంతో, దినేష్ కార్తీక్ అవసరం టీమిండియాకు లేకుండా పోయింది. ధోనీ శకం నడిచినంత కాలం దినేష్ కార్తీక్ అడపదడపా టీమిండియాలోకి వస్తూ పోతుండే వాడు.

అయితే గత మూడేళ్లుగా దినేష్ కార్తీక్ ఖాళీగా ఉన్నాడు. అతను ఫిబ్రవరి 27, 2019న ఆస్ట్రేలియాతో తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. అయితే ఐపీఎల్‌ 2022 సీజన్ లో మాత్రం కార్తీక్ ప్రదర్శన చాలా బాగుంది. ఆర్‌సీబీకి ఫినిషర్‌గా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడి 287 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని సగటు 57.40 మరియు స్ట్రైక్ రేట్ 191.3గా నమోదైంది. అంతేకాదు అతను 9 సార్లు నాటౌట్ కూడా అయ్యాడు.

దినేష్ కార్తీక్ వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాడు
ఐపీఎల్‌లో తన కల గురించి దినేష్ కార్తీక్ మాట్లాడుతూ, టీ 20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియాలో స్థానం సంపాదించుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. ఇందుకోసం తాను కష్టపడుతున్నానని. అంతే కాకుండా, ఐసిసి టోర్నమెంట్‌లో టీమిండియా మరోసారి గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో T20I సిరీస్ కోసం భారత జట్టు:
KL రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్-కెప్టెన్ & WK), దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dinesh Karthik
  • Hardik Pandya
  • India vs south africa
  • T20
  • umran malik

Related News

India Vs South Africa

రేపు సఫారీలతో టీమిండియా అమీతుమీ

India vs South Africa  టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సూపర్-8 రౌండ్‌లో తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2024 ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడిన ఈ రెండు జట్ల మధ్య ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు తమ సూపర్-8 ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. సూపర్-8లో భారత్

  • Hardik Pandya

    ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

Latest News

  • అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

  • Meena 2nd Marriage : రెండో పెళ్లిపై మీనా క్లారిటీ

  • 47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్

  • SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

  • Congress Vs BJP : కామారెడ్డిలో హైటెన్షన్.. కాంగ్రెస్, బీజేపీ వర్గాల ఘర్షణ !!

Trending News

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd