India vs Bangladesh: బంగ్లాకు చుక్కలు చూపించిన టీమిండియా.. భారత్ ఘన విజయం
బంగ్లాదేశ్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) టెస్ట్ సీరీస్ ను మాత్రం భారీ విజయంతో ఆరంభించింది. నాలుగో రోజు ఆతు వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. షకీబుల్ హసన్ ఎటాకింగ్ బ్యాటింగ్ తో దూకుడు గా ఆడినా ఫలితం లేకపోయింది.
- Author : Gopichand
Date : 18-12-2022 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో గెలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 272/6తో ఐదో రోజు ఆటను ఆరంభించిన బంగ్లా.. 324 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ 4, కుల్దీప్ 3, అశ్విన్, ఉమేశ్, సిరాజ్ తలో వికెట్ తీశారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 404/10, రెండో ఇన్నింగ్స్‌లో 258/2 డిక్లేర్ చేసింది.
బంగ్లాదేశ్ టూర్ లో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) టెస్ట్ సీరీస్ ను మాత్రం భారీ విజయంతో ఆరంభించింది. నాలుగో రోజు ఆతు వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు 11 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. షకీబుల్ హసన్ ఎటాకింగ్ బ్యాటింగ్ తో దూకుడు గా ఆడినా ఫలితం లేకపోయింది. షకీబుల్ 84 రన్స్ చేయగా బంగ్లా ఇన్నింగ్స్ 50 నిమిషాల్లోనే ముగిసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా.. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు.
Also Read: Former Indian cricketer: టీమిండియా మాజీ క్రికెటర్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్
తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 110, పుజారా 102 నాటౌట్ అద్భుతమైన సెంచరీలు సాధించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 86, పుజారా 90 పరుగులతో రాణించారు.ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల (India vs Bangladesh) మధ్య రెండో టెస్టు ఢాకా వేదికగా డిసెంబర్ 22 నుంచి ఫ్రారంభం కానుంది.