HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Squad For Asia Cup 2023 To Be Announced On Aug 20

Asia Cup 2023: ఆసియాకప్ కు జట్టు ఎంపిక ఎప్పుడో తెలుసా ?.. రీ ఎంట్రీకి సిద్ధమైన స్టార్ ప్లేయర్స్

వన్డే ప్రపంచకప్ కు ముందు భారత్ సత్తాకు పరీక్షగా మారిన ఆసియాకప్ టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెలాఖరు నుండి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ జరగనుంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-08-2023 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Asia Cup 2023
New Web Story Copy (30)

Asia Cup 2023: వన్డే ప్రపంచకప్ కు ముందు భారత్ సత్తాకు పరీక్షగా మారిన ఆసియాకప్ టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెలాఖరు నుండి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ జరగనుంది. ఈ టోర్నీకి భారత జట్టును ఆదివారం ప్రకటించనున్నారు. దీని కోసం అజిత్‌ అగర్కార్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఆసియాకప్ జట్టులో ఉన్న ఆటగాళ్ళే దాదాపుగా ప్రపంచకప్ ఆడే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అయితే గాయాలతో ఆటకు దూరమైన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. వీరిద్దరి ఫిట్ నెస్ పై పలు వార్తలు వస్తున్నా ఆసియాకప్ కు ఎంపికవుతారని అంచనా వేస్తున్నారు. వీరిద్దరి పునరాగమనంపై మాత్రం బోర్డు వర్గాల నుండి పూర్తి క్లారిటీ లేదు. కెఎల్ రాహుల్ ఫిట్ నెస్ సాధించినా.. అయ్యర్ ఇంకా కోలుకునేందుకు సమయం పడుతుందని బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఐర్లాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బుమ్రా ఆసియాకప్ లో ఆడడం ఖాయమే. ఇదిలా ఉంటే భారత్ కు చాలా కాలంగా సమస్యగా మారిన నెంబర్ 4 లో ఎవరిని కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ ను ఆడిస్తారని అనుకుంటున్నా.. టీ ట్వంటీల్లో రాణిస్తున్న స్కై వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తున్నాడు. అయితే ఈ స్థానానికి పలువురు యువక్రికెటర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో అదరగొట్టి విండీస్ తో టీ ట్వంటీ సిరీస్ కు ఎంపికై అందరినీ ఆకట్టుకున్న హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. విండీస్ తో సిరీస్ లో అరంగేట్రం చేసిన తిలక్ 57 సగటుతో 173 పరుగులు చేశాడు. ప్రపంచకప్ జట్టులో కూడా తిలక్ కు అనూహ్యంగా చోటు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని మాజీలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆసియాకప్ కు పాక్ ఆతిథ్యమిస్తుండగా.. అక్కడకు వెళ్ళేందుకు భారత్ నిరాకరించడంతో రెండో ఆతిథ్య దేశంగా శ్రీలంకను ఎంపిక చేశారు. భారత్ ఆడే మ్యాచ్ లన్నింటికీ లంకనే ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాక్ తో జరిగే మ్యాచ్ తో టీమిండియా ఆసియాకప్ వేట మొదలు కానుంది.

Also Read: Hormonal Breakouts: పీరియడ్స్ సమయంలో వచ్చే మొటిమలకు చెక్ పెట్టిండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2023
  • BCCI
  • India Squad
  • rohit sharma
  • team india

Related News

Rohit Sharma-Virat Kohli

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో కొనసాగుతారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

  • IPL 2026

    Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయం హిట్‌మ్యాన్ దేనా?

  • Womens T20 World Cup

    మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd