HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Demolished Bangaldesh In Third Odi

India Beat Bangladesh: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. సిరీస్ చేజార్చుకున్న భారత్ 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించి క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది

  • By Naresh Kumar Published Date - 07:46 PM, Sat - 10 December 22
  • daily-hunt
Teamindia
Teamindia Imresizer (1)

(Team India) బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. సిరీస్ చేజార్చుకున్న భారత్ 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించి క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు డామినేట్ చేసింది. ఏ దశలోనూ బంగ్లాదేశ్ పోటీనివ్వలేకపోయింది. తొలి రెండు వన్డేల్లో ఓటమితో విమర్శలు ఎదుర్కొన్న భారత్‌ 409 పరుగుల భారీస్కోర్ చేసింది. ధావన్ త్వరగానే ఔటైనా… ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అదరగొట్టారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పిన ఇషాన్ కిషన్ 126 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు.

సెంచరీ చేసేందుకు 85 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ తర్వాత 100 పరుగులు 41 బంతుల్లోనే సాధించాడంటే అతని జోరు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కోహ్లీ కూడా సత్తా చాటాడు. టీ ట్వంటీ ప్రపంచకప్ ఫామ్ కొనసాగిస్తూ మూడున్నరేళ్ళ తర్వాత శతకం^సాధించాడు. కోహ్లీకి ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో 72వ శతకం. ఇషాన్ కిషన్ 131 బంతుల్లోనే 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేయగా.. కోహ్లీ 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి జోరుతో భారత్ రన్‌రేట్‌ ఓవర్‌కు 10కి పైగా సాగింది. చివర్లో వరుస వికెట్లు కోల్పోయినా భారత్ 400 పరుగుల మార్కు దాటింది. వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇది నాలుగో అత్యధిక స్కోర్‌. అలాగే 400 పరుగులకు పైగా స్కోర్ చేయడం ఇది ఆరోసారి.

కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేయడంతో వరుస వికెట్లు కోల్పోయింది. షకీబుల్ హసన్ 43, లిట్టన్ దాస్ 29, యాసిర్ అలీ 25, హొస్సేన్ 20 పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో విఫలమైన భారత బౌలర్లు ఈ సారి మాత్రం రాణించారు. దీంతో బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ 3 , అక్షర్ పటేల్ 2 , ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్‌దీప్‌యాదవ్,వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd ODI
  • india beat bangladesh
  • India vs Bangladesh
  • ishan kishan
  • team india
  • virat kohli

Related News

Virat Kohli

Virat Kohli: రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ!

విరాట్ కోహ్లీ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన మే 2025లో భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. టీమ్ ఇండియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Asia Cup Final

    Asia Cup Final: నేడు ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. టీమిండియా ఛాంపియ‌న్‌గా నిల‌వాలంటే!

  • Sarfaraz Khan

    Sarfaraz Khan: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై వివాదం.. ఎంపిక చేయ‌క‌పోవడానికి కారణం ఏంటి?

  • Harmanpreet Kaur

    Harmanpreet Kaur: చ‌రిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవ‌కాశం: హర్మన్‌ప్రీత్ కౌర్

  • IND vs WI

    IND vs WI: జగదీసన్‌కు టెస్ట్ జట్టులో చోటు.. కిషన్‌కు మొండిచేయి!

Latest News

  • Tilak Varma: ఫైన‌ల్ పోరులో పాక్‌ను వ‌ణికించిన తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌!

  • Asia Cup 2025 Title: ఆసియా కప్ 2025 విజేతగా భారత్!

  • Vijay Car Collection: త‌మిళ న‌టుడు విజ‌య్ వ‌ద్ద ఉన్న కార్లు ఇవే..!

  • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

  • Mental Health: మీ మెదడుకు మీరే పెద్ద శత్రువు.. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే 3 అలవాట్లు ఇవే!

Trending News

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd