IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు!
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని భారత పర్యటనకు వస్తోంది. మరోవైపు భారత జట్టు WTC 2025-27 సైకిల్‌లో తమ మొదటి సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది.
- By Gopichand Published Date - 08:55 AM, Sun - 9 November 25
IND vs SA: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదవ T20 మ్యాచ్ వర్షం కారణంగా శనివారం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. కానీ ఈ విజయాన్ని సంబరాలు చేసుకునేందుకు భారత ఆటగాళ్లకు ఒక రోజు కూడా సమయం దొరకలేదు. సమాచారం ప్రకారం.. కెప్టెన్ శుభమన్ గిల్ సహా నలుగురు భారత ఆటగాళ్లు ఆదివారం కొలకతా చేరుకోనున్నారు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (IND vs SA) మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుండి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది.
కోల్‌కతాకు బయలుదేరిన ఆటగాళ్లు
న్యూస్ ఏజెన్సీ PTI సమాచారం ప్రకారం.. శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా బ్రిస్బేన్ నుండి నేరుగా కోల్‌కతా విమానం ఎక్కనున్నారు. దక్షిణాఫ్రికా జట్టు కూడా ఆదివారం కోల్‌కతా చేరుకుంటుంది. మిగతా భారత ఆటగాళ్లు సోమవారం వేర్వేరు బృందాలుగా కోల్‌కతాకు చేరుకుంటారు. భారత జట్టు మంగళవారం నుండి తదుపరి టెస్ట్ సిరీస్‌కు ప్రాక్టీస్ ప్రారంభించనుంది.
Also Read: Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. డిసెంబర్ 1 నుంచి హీట్ పెంచబోతున్నాయా?
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభమవుతుంది.
- మొదటి టెస్ట్: నవంబర్ 14 నుండి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో
- రెండవ టెస్ట్: నవంబర్ 22 నుండి గువాహటిలో జరుగుతుంది.
దక్షిణాఫ్రికా జట్టు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని భారత పర్యటనకు వస్తోంది. మరోవైపు భారత జట్టు WTC 2025-27 సైకిల్‌లో తమ మొదటి సిరీస్‌ను ఇంగ్లాండ్‌తో ఆడింది. శుభమన్ గిల్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై టెస్ట్ సిరీస్‌లో 2-2తో డ్రాగా నిలువరించింది.
హెడ్-టు-హెడ్ రికార్డు
భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు మొత్తం 44 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. టీమ్ ఇండియా 16 సార్లు విజయం సాధించింది. విజయాల విషయంలో దక్షిణాఫ్రికా కొంచెం ముందుంది. ఆ జట్టు 18 సార్లు భారత్‌ను టెస్ట్ మ్యాచ్‌లలో ఓడించింది. 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ముఖ్యంగా గత నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా 3 సార్లు భారత్‌ను ఓడించింది.