IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవరంటే?
జ్యోతిష్య అంచనాల ప్రకారం.. నేడు శుభమన్ గిల్, తిలక్ వర్మ ఇద్దరి గ్రహ బలం బలంగా ఉంది. వీరిద్దరి బ్యాట్లు బాగా పరుగులు చేసే అవకాశం ఉంది. బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు.
- By Gopichand Published Date - 08:15 PM, Sun - 28 September 25

IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ (IND vs PAK Final) పోరులో భారత్- పాకిస్థాన్ మధ్య జరగనుంది. దుబాయ్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ టైటిల్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ పోరులో భారత్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఎవరు ఓటమిని ఎదుర్కొంటారు? అనే అంశాలపై జ్యోతిష్య విశ్లేషణను పరిశీలిద్దాం.
రికార్డులు భారత్‌కు అనుకూలం
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఇప్పటికే రెండుసార్లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు కూడా పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 21న సూపర్-4లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు ప్రస్తుతం పటిష్టంగా ఆడుతోంది. నేటి మ్యాచ్‌లో కూడా బలంగా కనిపిస్తుంది.
Also Read: LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జ్యోతిష్య విశ్లేషణ
నేటి ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఉండే గ్రహాలు, నక్షత్రాల ప్రభావం ఫైనల్ మ్యాచ్ ఫలితంపై కనిపిస్తుంది.
జాతక విశ్లేషణ: ఈ సమయానికి సంబంధించిన జాతకాన్ని పరిశీలిస్తే ఇది మేష లగ్నం జాతకంగా ఏర్పడుతోంది. శుక్రుడు- కేతువులు పంచమ భావంలో సూర్యుడు, బుధుడు ఆరవ భావంలో, అంగారకుడు (కుజుడు) సప్తమ భావంలో, చంద్రుడు అష్టమ భావంలో, రాహువు పదకొండవ భావంలో, శని పన్నెండవ భావంలో కొలువై ఉన్నారు.
ఫలితం అంచనా: ఈ గ్రహ స్థానం శుక్ర, కేతు, రాహువుల స్థితిని సూచిస్తోంది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. అయినప్పటికీ చివరికి విజయం భారత్‌కే దక్కుతుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రహాల బలం: గురుడు (బృహస్పతి), మంగళుడు (కుజుడు) స్థానం భారత్ విజయానికి సంకేతం. ఈ రెండు గ్రహాల స్థానాలు బలంగా ఉండటం వలన భారత్ మంచి విజయాన్ని సాధిస్తుందని తెలుస్తోంది.
కీలక ఆటగాళ్లు: జ్యోతిష్య అంచనాల ప్రకారం.. నేడు శుభమన్ గిల్, తిలక్ వర్మ ఇద్దరి గ్రహ బలం బలంగా ఉంది. వీరిద్దరి బ్యాట్లు బాగా పరుగులు చేసే అవకాశం ఉంది. బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం శారదీయ నవరాత్రి పర్వదినం కూడా జరుగుతున్నందున భారత జట్టుపై దుర్గా దేవి కృప ఉంటుందని నమ్ముతున్నారు. ఈ జ్యోతిష్య అంచనాల ప్రకారం.. టాప్ ఆర్డర్ రాణించడం, ప్రధాన బౌలర్ల ప్రదర్శనతో భారత్ ఈ ఫైనల్‌ను గెలిచి, 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది.