IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవసం!
బ్రిస్బేన్‌లోని చారిత్రక గబ్బా మైదానంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి రాగా.. ఇద్దరూ ప్రారంభం నుంచే బ్యాట్‌ను ఝుళిపించడం మొదలుపెట్టారు.
- By Gopichand Published Date - 05:13 PM, Sat - 8 November 25
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 4.5 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. దీంతో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ టీ20 సిరీస్‌లలో ఓడిపోని తన పరంపరను కొనసాగించాడు.
బ్రిస్బేన్‌లోని చారిత్రక గబ్బా మైదానంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి రాగా.. ఇద్దరూ ప్రారంభం నుంచే బ్యాట్‌ను ఝుళిపించడం మొదలుపెట్టారు. మొదటి 2 ఓవర్లలో టీమిండియా 19 పరుగులు చేసింది. ఆ తర్వాత 4 ఓవర్లలో స్కోరు 47 పరుగులకు చేరుకుంది. ఐదో ఓవర్లో ఐదో బంతి వేసిన తర్వాత వర్షం పెరగడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత దాదాపు 2 గంటల 15 నిమిషాల పాటు మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.
Also Read: Fastest Trains: ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లు ఇవే!
భారత్ 2-1 తేడాతో సిరీస్ గెలిచింది
మొదటి మ్యాచ్ వర్షం పాలవగా.. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌లో టీమిండియా తిరిగి పుంజుకుని 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిల ఘాటైన బౌలింగ్ కారణంగా భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగో మ్యాచ్‌ను కూడా టీమిండియా గెలిచి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నందున బ్రిస్బేన్ టీ20 మ్యాచ్ రద్దు కావడం భారత జట్టుకు అనుకూలించింది. ఫలితంగా భారత్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.