South Africa vs New Zealand: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్.. రేపే ఫైనల్ మ్యాచ్
దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ రెండూ ఇప్పటి వరకు ICC మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవలేకపోయిన జట్లు. ఈ రెండు జట్లూ తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
- By Gopichand Published Date - 09:02 AM, Sat - 19 October 24

South Africa vs New Zealand: మహిళల టీ20 ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరో తేలనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ (South Africa vs New Zealand) తలపడనున్నాయి. ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ-ఫైనల్ న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరువైంది. 14 ఏళ్ల తర్వాత తొలిసారిగా 2024 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది.
దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ రెండూ ఇప్పటి వరకు ICC మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవలేకపోయిన జట్లు. ఈ రెండు జట్లూ తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రెండు దేశాలకు ఇది చాలా ప్రత్యేకమైన క్షణం. ఇప్పటి వరకు రెండు దేశాలకు చెందిన పురుషులు లేదా మహిళల జట్టు ఏ ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా.., అది చాలా చారిత్రాత్మకమైనదిగా నిలవనుంది.
Also Read: Rohit Sharma Disappointment: కోహ్లీ ఔట్.. రోహిత్ శర్మ రియాక్షన్ మరోసారి వైరల్
దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది
మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే గత సారి దక్షిణాఫ్రికా టైటిల్ గెలవలేకపోయింది. గత ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు.. 2024 పురుషుల T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా కూడా ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్‌లో టీమ్ ఇండియా చేతిలో ఓడిపోవడంతో మొదటిసారి టైటిల్‌ను గెలుచుకోవాలనే దక్షిణాఫ్రికా కల చెదిరిపోయింది. ఇక మహిళల జట్టు టైటిల్ గెలిచి దక్షిణాఫ్రికాకు చెందిన చోకర్ల ట్యాగ్‌ని తొలగిస్తుందని అభిమానుల అంచనాలు వేస్తున్నారు.