Sourav Ganguly : కోహ్లీ నాకంటే టాలెంటెడ్ ప్లేయర్..!!
భారత క్రికెట్ లో దూకుడైన కెప్టెన్ గానే కాదు దూకుడైన ఆటగాడిగా సౌరవ్ గంగూలీకి మరెవరూ సాటిరారు.
- By Naresh Kumar Published Date - 11:05 PM, Sat - 10 September 22

భారత క్రికెట్ లో దూకుడైన కెప్టెన్ గానే కాదు దూకుడైన ఆటగాడిగా సౌరవ్ గంగూలీకి మరెవరూ సాటిరారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత క్రికెట్ కు దూకుడు నేర్పిన సారథి దాదానే. ప్రత్యర్థి జట్లకు ఆటతోనే కాదు మాటతోనూ బదులిచ్చేలా జట్టును తీర్చిదిద్దాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ గంగూలీ చాలా రికార్డులు సాధించాడు. అయితే ప్రస్తుత తరంలో గంగూలీ, కోహ్లీని చాలా మంది పోల్చి చూస్తారు. దాదా దూకుడైన వ్యక్తిత్వం కోహ్లీలోనూ ఉంటుందన్నది తెలిసిన విషయమే.
అయితే కోహ్లీ మాత్రం తన కంటే టాలెంట్ ప్లేయర్ అంటున్నాడు గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న దాదా విరాట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.ప్లేయర్లను వారి స్కిల్స్ ఆధారంగా పోల్చాలన్నాడు. అలా చూసుకుంటే తన కంటే విరాట్ కోహ్లీ చాలా టాలెంటేడ్ ఆటగాడని వ్యాఖ్యానించాడు. టాలెంట్ లేకపోతే ఇన్ని సెంచరీలు రావు కదాని తేల్చేశాడు. తామిద్దరం వేర్వేరు తరాల్లో ఆడామనీ, తాను కూడా చాలా క్రికెట్ ఆడాననీ, అయితే తాను ఆడిన విధానం వేరన్నాడు.
ప్రస్తుతానికైతే ఇప్పటి వరకూ తానే ఎక్కువ మ్యాచ్ లు ఆడినా కోహ్లీ వాటిని అధిగమిస్తాడని చెప్పాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఫామ్ గురించి మీడియాలో వచ్చిన కథనాలపై దాదా స్పందించాడు. మీడియా గతంలో తానపై కూడా చాలా వార్తలు రాసిందని, అయితే వాటిలో సగం కూడా తనకు తెలీదన్నాడు. అప్పట్లో తాను హోటల్ కు వెళ్లగానే, రిసెప్షన్‌కి వెళ్లి, తన రూమ్‌లో పేపర్ వేయొద్దని చెప్పేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నానని దాదా చెప్పాడు. కాగా ఆసియాకప్ కు కోహ్లీని ఎంపిక చేసినప్పుడు పలు విమర్శలు వచ్చాయి. అయితే ఈ టోర్నీలో విరాట్ పూర్తి ఫామ్ అందుకున్నాడు. ఆద్యంతం నిలకడగా రాణించి విమర్శలకు చెక్ పెట్టాడు.
Related News

Virat Kohli: రాజ్‌కోట్ వన్డేలో ప్రత్యేక మైలురాయిని సాధించిన కింగ్ కోహ్లీ
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చినప్పటికీ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన ఇన్నింగ్స్‌లో 56 పరుగులతో ప్రత్యేక మైలురాయిని సాధించాడు.