Messi: హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!
మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు.
- By Gopichand Published Date - 07:31 PM, Fri - 28 November 25
Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi)కి సంబంధించిన ఒక పెద్ద వార్త వచ్చింది. లియోనెల్ మెస్సీ వచ్చే నెల ‘GOAT టూర్ ఇండియా 2025’లో భాగంగా భారతదేశ పర్యటనకు వస్తున్నారు. మెస్సీ భారత్‌కు రావడం పట్ల అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెస్సీ భారత పర్యటనలో మరో నగరం పేరు చేరింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన ‘GOAT టూర్ టు ఇండియా 2025’ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఉంటుందని ధృవీకరించారు. హైదరాబాద్ ఆయన భారత పర్యటనలో నాల్గవ మజిలీ కానుంది.
మెస్సీ పర్యటన వివరాలు
లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న కోల్‌కతా నుండి తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్తారు. ఆ తర్వాత డిసెంబర్ 14న ముంబై, డిసెంబర్ 15న న్యూ ఢిల్లీ వెళ్లి తన టూర్‌ను ముగిస్తారు. ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read: Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!
మెస్సీ పోస్ట్
మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు. భారతదేశం నుండి లభించిన ప్రేమకు అందరికీ ధన్యవాదాలు! GOAT టూర్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కాబోతోంది! నా కోల్‌కతా, ముంబై, ఢిల్లీ పర్యటనలకు హైదరాబాద్ కూడా జోడించబడిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. త్వరలో కలుద్దాం ఇండియా! అంటూ పోస్ట్ చేశారు.
ఎక్కడెక్కడ పర్యటిస్తారు?
గతంలో నవంబర్ 17న కోచ్చిలో జరగాల్సిన అర్జెంటీనా స్నేహపూర్వక మ్యాచ్ రద్దు కావడంతో టూర్‌లో హైదరాబాద్‌ను చేర్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ప్రణాళిక ప్రకారం మెస్సీ ‘GOAT టూర్’ దేశంలోని నాలుగు దిక్కులను అంటే తూర్పు (కోల్‌కతా), దక్షిణం (హైదరాబాద్), పశ్చిమం (ముంబై). ఉత్తరం (న్యూ ఢిల్లీ)లను కవర్ చేస్తుంది.