Huge Flexi : కోహ్లీ ఇక్కడ…క్రేజ్ అలానే ఉంటాది మరి..!!
వరల్డ్ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నా విపరీతమయిన క్రేజ్ కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ముందు ప్లేస్ లో ఉంటాడు.
- By hashtagu Published Date - 07:24 PM, Tue - 27 September 22

వరల్డ్ క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నా విపరీతమయిన క్రేజ్ కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ముందు ప్లేస్ లో ఉంటాడు. అరంగేట్రం చేసినప్పటి నుంచీ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విరాట్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఫాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళినా…ఇంగ్లాండ్ వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ఇక సొంత గడ్డపై ప్రత్యేకంగా చెప్పాలా…ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
ఆశ్చర్యం ఏమిటంటే గత మూడేళ్లుగా ఫామ్ కోల్పోయిన కోహ్లీ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. అయినప్పటికీ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆసియాకప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం బాది.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. కీలక టీ20 ప్రపంచకప్ ముందు కింగ్ కోహ్లీ ఒకప్పటిలా ఆడుతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా తిరువనంతపురంలో కోహ్లీ భారీ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఈ కటౌట్, విరాట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత్ , సౌతాఫ్రికా మధ్య మూడు టీ ట్వంటీల సీరీస్ బుధవారం నుంచి మొదలు కానుంది. తొలి టీ ట్వంటీకి తిరువనంతపురం, రెండో మ్యాచ్ కు గౌహతి, మూడో మ్యాచ్ కు ఇండోర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
The craze for Virat Kohli is unreal 🙌
#ViratKohli #Thiruvananthapuram #Melbourne #T20WorldCup pic.twitter.com/cLtKD9SSZx
— CricTracker (@Cricketracker) September 27, 2022