Hardik Pandya : విజయ్ హజారేలో హార్దిక్ ..వన్డే ఫార్మేట్లోకి రీఎంట్రీ
Hardik Pandya : నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది
- By Sudheer Published Date - 07:50 PM, Fri - 27 December 24

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రస్తుతం దేశవాళీ టోర్నీ(Tournament)లో ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)లో హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ షోతో అదరగొట్టాడు. అయితే వన్డే ఫార్మేట్ కు దూరమైన హార్దిక్ త్వరలో తిరిగి రానున్నాడు. అవును ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 50 ఓవర్ల మ్యాచ్‌లలో హార్దిక్ పునరాగమనం చేయడం టీమ్ ఇండియాకు శుభసూచకం. నిజానికి విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ ఆడనున్నాడు. ఈ ట్రోఫీ 50 ఓవర్ల ఫార్మెట్లో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ దేశవాళీ టోర్నీ హార్దిక్ కి మంచి ఆరంభం అనే చెప్పాలి.
2023 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 19 అక్టోబర్ 2023న మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచి హార్దిక్ వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. అయితే హార్దిక్ వన్డే పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు హార్దిక్ వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి రావడం టీమ్ ఇండియాకు ఉపశమనం కలిగించే అంశం.
హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 50 ఓవర్ల ఫార్మెట్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. బరోడా తరఫున బెంగాల్‌తో బరిలోకి దిగనున్నాడు. హార్దిక్ తిరిగి వన్డేల్లోకి రావడంతో అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకం. ఈ పరిస్థితిలో హార్దిక్ ఈ టోర్నమెంట్ లో రాణించాల్సి ఉంది. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి కూడా విజయ్ హజారే ట్రోఫీ హెల్ప్ అవుతుంది.
Read Also : Tollywood: టాలీవుడ్‌లో ఈ ముగ్గురు స్టార్‌లు చులకన అయ్యారా?