WTC Final 2023: WTC ఫైనల్ శుభమాన్ గిల్ కు అతిపెద్ద సవాల్…
చిన్న వయసులోనే అత్యుత్తమ క్రికెటర్ గా రాణిస్తున్నాడు శుభమాన్ గిల్. మూడు ఫార్మాట్లలో అద్భుతంగ ఫామ్ కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2023 కూడా గిల్‌కి చాలా చిరస్మరణీయమైనది
- By Praveen Aluthuru Published Date - 01:30 PM, Sun - 4 June 23

WTC Final 2023: చిన్న వయసులోనే అత్యుత్తమ క్రికెటర్ గా రాణిస్తున్నాడు శుభమాన్ గిల్. మూడు ఫార్మాట్లలో అద్భుతంగ ఫామ్ కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2023 కూడా గిల్‌కి చాలా చిరస్మరణీయమైనది. ఈ సీజన్ ఐపీఎల్ లో గిల్ 890 పరుగులతో జట్టుకు ఇంపాక్ట్ ప్లేయార్ గా రాణించాడు. అటువంటి పరిస్థితిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో కూడా శుభమాన్ గిల్ పై భారత జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే త్వరలో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గిల్ కు కలిసిరాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ .
తాజాగా గ్రెగ్ చాపెల్ శుభమాన్ గిల్ ప్రదర్శనపై స్పందించాడు. ఈ సందర్భంగా శుభ్‌మాన్ గిల్ అతిపెద్ద బలహీనత ఏంటో బయటపెట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆఫ్-స్టంప్ వైపు వేసే బంతులు శుభ్‌మన్ గిల్ ను బాగా ఇబ్బంది పెడతాయి. అలాగే బంతి బౌన్స్ అయితే గిల్ బాగా అడగలడని, అయితే ఆస్ట్రేలియా బౌలర్లు బాగా బౌలింగ్ చేయకపోతే గిల్ ఖచ్చితంగా వారికి గుణపాఠం చెబుతాడని చాపెల్ అన్నారు.
మరో ప్లేయర్ మిచెల్ స్టార్క్ శుభ్‌మన్ గిల్‌ను తన బౌలింగ్ తో ఇబ్బంది పెట్టగలడని చాపెల్ అభిప్రాయపడ్డాడు. హై పేస్ కారణంగా అతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రమేనన్నారు. స్టార్క్ ఏ బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలడని చెప్పారు. మరో ప్లేయర్ హేజిల్‌వుడ్ ఫిట్‌గా ఉంటే శుభమాన్‌కు అతిపెద్ద తలనొప్పిగా మారుతాడని చాపెల్ పేర్కొన్నారు.
Read More: Shubman Gill: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న గిల్, సారా అలీఖాన్.. బ్రేకపే కారణమా..?