HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gills Brilliant Century Big Score For India

Shubhman Gill Century: గిల్ మెరుపు శతకం..భారత్ భారీస్కోరు

సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో భారత్ భారీస్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ విశ్వరూపం చూపించాడు. బ్యాట్‌తో కివీస్ బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.

  • Author : Naresh Kumar Date : 01-02-2023 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Subhaman Gill)
Shubham Gill Imresizer

Ind Vs NZ 3rd T20: సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో భారత్ భారీస్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ విశ్వరూపం చూపించాడు. బ్యాట్‌తో కివీస్ బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. మరోసారి అవకాశాన్ని వృథా చేసుకున్న ఇషాన్ కిషన్ 1 పరుగుకే ఔటయ్యాడు. తర్వాత శుభ్‌మన్‌ గిల్, రాహుల్ త్రిపాఠీ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. వన్‌డౌన్ బ్యాటర్ త్రిపాఠీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. తర్వాత సూర్యకుమార్‌యాదవ్, పాండ్యా సహకారంతో గిల్ మరింతగా రెచ్చిపోయాడు. స్టేడియం నలువైపులా మెరుపు షాట్లు ఆడాడు. సూర్యకుమార్‌తో కలిసి 38 రన్స్‌ , పాండ్యాతో కలిసి 103 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. పాండ్యాతో కలిసి 103 రన్స్‌ను గిల్ 6.4 ఓవర్లలోనే సాధించాడంటే ఏ రేంజ్‌లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు.

కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన గిల్ కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో అతనికిదే తొలి శతకం. కాగా అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో సురేశ్ రైనా, రోహిత్‌శర్మ , కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రమే అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాళ్ళు. ఇప్పుడు గిల్ కూడా వీరి సరసన చేరాడు. శతకం తర్వాత మరింతగా రెచ్చిపోయిన గిల్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. పాండ్యా కూడా ధాటిగా ఆడి 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. ఓవరాల్‌గా కివీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3rd T20
  • Inda vs New Zeland
  • Shubman Gill

Related News

Bcci Naman Awards 2026 Shubman Gill

శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

Bcci Naman Awards 2026  న్యూఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 వేడుకలో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ అవార్డు)గా ఎంపికయ్యాడు. 2024-25 సీజన్‌లో అతని అద్భుత ప్రదర్శనకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా ఇంగ్లండ్ టూర్‌లో టెస్ట్ సిరీస్‌లో 754 పరుగులు చేసి జట్టుకు నాయకత్వం వహించాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవా

  • BCCI Naman Awards 2026

    బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • Bcci Col Ck Nayudu Lifetime Achievement Award

    బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

Latest News

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd