Gautam Gambhir: శ్రీవారి సేవలో గౌతర్ గంభీర్, భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమా
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇటీవల తిరుమలకు వచ్చిన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 01:02 PM, Thu - 28 September 23

టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇటీవల తిరుమలకు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమల స్వామిని దర్శించుకున్న ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు గంభీర్‌కు వేద ఆశీస్సులు అందించారు. ఆలయ అధికారులు ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంభీర్‌తో సెల్ఫీలు దిగి పలువురు క్రికెట్ అభిమానులు పులకరించిపోయారు. శ్రీవారి అద్భుత దర్శనం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గంభీర్ కూడా రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత్ గెలిచే మంచి అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. 1.4 బిలియన్ల భారతీయుల ప్రార్థనలతో ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్డే ప్రపంచకప్ వచ్చే నెలలో భారత్‌లో ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ మధ్య మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Also Read: TTD: శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా