TTD: శ్రీవారి గురువారం నిజరూప దర్శనం గురించి మీకు తెలుసా
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు.
- Author : Balu J
Date : 28-09-2023 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. క్షణాల్లో దర్శనమిచ్చే శ్రీనివాసుడి కోసం తహతహలాడుతుంటారు. అయితే శ్రీవారి దర్శన భాగ్యం దొరికితే చాలు అనుకునే భక్తులు మాత్రం గురువారం దర్శించుకోవడం వరంగా భావిస్తారు. అందుకంటే గురువారం రోజు స్వామి వారు నిజరూప దర్శనమిస్తాడు.
వారంలో ఆరు రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాట్టుని ఎటువంటి అలంకారాలు, ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజ రూపంతో భక్తులకు దర్శనమిస్తారు.
నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్ధ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు.
దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలు దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది.
ఆ రోజు ఆభరణాలకు బదులు పట్టుధోవతిని ధరింపజేస్తారు.
కిరీటాన్ని తీసి పట్టు వస్త్రాన్ని తలపాగాలా చుడతారు.
గురువారం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా చిన్న తప్పు చేయడానిక్కూడా సిబ్బంది భయపడతారు.
ఎందుకంటే పుణ్యకార్యాలు చేసినవారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం.
గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని కూడా అంటారు.
Also Read: Green India Challenge: గణేశ్ నిమజ్జనంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. జూట్ బ్యాగ్స్ పంపిణీ