Virat Kohli: విరాట్ ను అలా అవమానించిన గంగూలీ.. దెబ్బకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ క్రికెటర్?
మామూలుగా మనస్పర్దాలు వల్ల లేక ఏదో ఒక విషయం వల్ల అవతలి వ్యక్తులను దూరం పెడుతూ ఉంటారు. అలా ఇద్దరి మనుషుల మధ్య జరిగే సైలెంట్ యుద్ధం
- By Anshu Published Date - 10:14 PM, Mon - 17 April 23

Virat Kohli: మామూలుగా మనస్పర్దాలు వల్ల లేక ఏదో ఒక విషయం వల్ల అవతలి వ్యక్తులను దూరం పెడుతూ ఉంటారు. అలా ఇద్దరి మనుషుల మధ్య జరిగే సైలెంట్ యుద్ధం ఎంత కాలం ఉంటుందో తెలియదు కానీ ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య జరిగే కొన్ని విషయాలు మాత్రం కాస్త కఠినంగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక హోదాలో ఉన్న వారి మధ్య కూడా జరుగుతూ ఉంటాయి.
అయితే అటువంటిదే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుంచి వీరి మధ్య విభేదాలు వస్తున్నాయి. ఎప్పుడైతే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారో అప్పటినుంచి వీరి మధ్య గొడవ ముదిరిందని తెలిసింది. అయితే రీసెంట్ గా జరిగిన ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో కూడా వీరి మధ్య బాగానే సైలెంట్ వార్ జరిగింది.
ఇటీవల చిన్న స్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగగా ఆ సమయంలో కోహ్లీ గంగూలీ వైపు చాలా సీరియస్ గా చూసినట్లు కనిపించాడు. అంతేకాకుండా మ్యాచ్ అయిన తర్వాత గంగూలీ ఆటగాళ్లందరకి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించగా ఆ సమయంలో కోహ్లీకి ఇవ్వకుండా ముందుకు వెళ్లి పోయాడు.
నిజానికి ఆ సమయంలో కోహ్లీ మరో ప్లేయర్ తో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. దీంతో గంగూలీ విరాట్ కోసం ఆగకుండా ముందుకి వెళ్ళిపోవటంతో మరోసారి కోహ్లీ అతని వైపు సీరియస్ గా చూశాడు. దీంతో కోహ్లీ అవమానంగా ఫీల్ అయినట్లు కనిపించాడు. ఇక వెంటనే తన ఇన్స్టాగ్రామ్ లో గంగూలీని అన్ ఫాలో చేసి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి మధ్య లోలోపల జరుగుతున్న ఈ రహస్య యుద్ధం ఇంకెంత ముందుకు వెళ్తుందో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.