Team India Future: గంభీర్ వచ్చాడు..టీమిండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
టీమ్ ఇండియాకు గతంలో రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టన్, డంకన్ ఫ్లెచర్ వంటి ప్రశాంతమైన వ్యక్తులు కోచ్‌లుగా సేవలందించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ కు వచ్చింది అంత సున్నితమైన వ్యక్తి అయితే కాదు.
- By Praveen Aluthuru Published Date - 08:55 PM, Sun - 14 July 24

Team India Future: టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. గంభీర్ హయాంలో వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూపంలో భారత్ రెండు అతి పెద్ద టోర్నమెంట్‌లను ఆడనుంది. కోచ్‌గా గంభీర్‌కు ఈ రెండు టోర్నమెంట్లు సవాల్ అనే చెప్పాలి. టీమ్ ఇండియాకు గతంలో రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టన్, డంకన్ ఫ్లెచర్ వంటి ప్రశాంతమైన వ్యక్తులు కోచ్‌లుగా సేవలందించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ కు వచ్చింది అంత సున్నితమైన వ్యక్తి అయితే కాదు.
భారత్ చివరిసారిగా 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. రెండుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోలేకపోయింది. అయితే గంభీర్ రోహిత్ కెప్టెన్సీకి అభిమాని కూడా. కాబట్టి కెప్టెన్-కోచ్ రేలషన్శిప్ చాలా సాఫీగా ఉంటుందని ఆశించవచ్చు. అయితే ఇప్పుడు అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఐపీఎల్‌లో కోహ్లీ, గంభీర్ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఆన్‌ఫీల్డ్ వివాదం చాలా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అయితే లాస్ట్ ఎడిషన్ ఐపీఎల్ లో మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. ఒకరిని ఒకరు పలకరించుకుని హాగ్ చేసుకున్నారు. ఇది చూడటానికి ఫ్యాన్స్ కు రెండు కళ్ళు చాలలేదు. స్టార్ ప్లేయర్లు ఆధిపత్యం చెలాయించే నేటి క్రికెట్‌లో గంభీర్ ముక్కుసూటిగా మాట్లాడేవాడు.
ఆటగాళ్లకు పెరుగుతున్న వయస్సు వారిలో అభద్రతా భావాన్ని సృష్టిస్తుంది. అందుకే గంభీర్ లో ఆ యాంగ్రీ తత్త్వం కాస్త తగ్గింది . కేవలం జట్టు విజయం కోసమే తన ఆలోచనగా ముందుకెళ్తున్నాడు. 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు సునీల్ నరైన్, మరియు ఆండ్రీ రస్సెల్ వంటి సీనియర్ ఆటగాళ్లకు అతను పూర్తి మద్దతునిచ్చి వాళ్లలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ కోచింగ్‌లో రోహిత్, కోహ్లితో పాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన చూడదగ్గదే. కోచ్ అయిన తర్వాత గంభీర్ భారతదేశాన్ని తన గుర్తింపుగా అభివర్ణించాడు దేశానికి సేవ చేయడం చాలా గర్వంగా ఉందన్నాడు. తన హయాంలో భారత క్రికెట్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి శ్రమిస్తానని చెప్పాడు.మొత్తానికి టీమిండియాకు గంభీర్ హెడ్ కోచ్ కావడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకరిస్తుంది.
Also Read: Anant-Radhika Wedding: ముంబై టూ లండన్: అనంత్-రాధికల వివాహ సంబరాలు కంటిన్యూ