Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Fit Again Rohit Sharma To Return Eyes Series Win Against West Indies

Rohit Sharma: సిరీస్‌కు అడుగుదూరంలో భారత్‌

కరేబియన్ టూర్‌లో మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. వన్డే సిరీస్ తరహాలోనే తన జోరు కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్‌కు అడుగుదూరంలో నిలిచింది.

  • By Naresh Kumar Published Date - 01:08 PM, Sat - 6 August 22
Rohit Sharma: సిరీస్‌కు అడుగుదూరంలో భారత్‌

కరేబియన్ టూర్‌లో మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. వన్డే సిరీస్ తరహాలోనే తన జోరు కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్‌కు అడుగుదూరంలో నిలిచింది. ఇవాళ ఫ్లోరిడా వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరెట్‌గా చెప్పొచ్చు. చివరి రెండు మ్యాచ్‌లూ ఫ్లోరిడాలోనే జరగనుండగా ఒక్కటి గెలిచినా సిరీస్ భారత్ వశమవుతుంది. బలబలాలు, ఫామ్ పరంగా భారత్‌దే పైచేయిగా ఉన్నప్పటకీ… రెండో మ్యాచ్‌లో పుంజుకుని సిరీస్ సమం చేసిన విండీస్‌ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి.

కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోవడం ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇవాళ గెలిస్తే సిరీస్ చేజిక్కించుకుంటుంది. ఒకవేళ విండీస్ గెలిస్తే మాత్రం చివరి మ్యాచ్ సిరీస్‌ను డిసైడ్ చేయనుంది. ప్రత్యర్థికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా నాలుగో మ్యాచ్‌తోనే సిరీస్ గెలుచుకోవాలని రోహిత్‌సేన పట్టుదలగా ఉంది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్, రిషబ్ పంత్ ఫామ్‌లోకి రావడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. బౌలింగ్ పరంగా సీనియర్ భువనేశ్వర్‌కుమార్ నిలకడగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం.^అలాగే హార్థిక్ పాండ్యా, అర్షదీప్‌సింగ్ ఆకట్టుకుంటున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో భీకరమైన బ్యాటింగ్‌తో రెచ్చిపోయే విండీస్‌ను కట్టడి చేయడంలో వీరంతా విజయవంతమయ్యారు. దీంతో మరోసారి బౌలర్లపైనే అంచనాలున్నాయి.

మరోవైపు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విండీస్‌కు గెలుపు తప్పనిసరి. వన్డే సిరీస్‌లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన కరేబియన్లు టీ ట్వంటీల్లో మాత్రం పర్వాలేదనిపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్‌ను నిలవరించారు. అయితే రెండో టీ ట్వంటీలో బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. దీంతో నాలుగో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ సమం చేయాలని విండీస్ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఫ్లోరిడాలోని లాండర్‌హిల్ పిచ్‌ టీ20 ఫార్మట్‌కు పూర్తి అనుకూలిస్తుంగి. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచే ఉద్ధేశంతో అక్కడ మ్యాచ్‌లు ఏర్పాటు చే

Tags  

  • India vs west indies
  • rohit sharma
  • T20 series

Related News

Shikhar Dhawan: సెలక్టర్లపై గబ్బర్ సంచలన వ్యాఖ్యలు

Shikhar Dhawan: సెలక్టర్లపై గబ్బర్ సంచలన వ్యాఖ్యలు

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ టీ ట్వంటీ కెరీర్ ఇక ముగిసినట్టేనా...యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైన వేళ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లాన్స్ లో గబ్బర్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.

  • India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

    India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ

  • Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

    Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్

  • T20 Series Win: టీ ట్వంటీ సీరీస్ కూడా మనదే

    T20 Series Win: టీ ట్వంటీ సీరీస్ కూడా మనదే

  • Rohit Sharma: కోలుకుంటున్న హిట్ మ్యాన్

    Rohit Sharma: కోలుకుంటున్న హిట్ మ్యాన్

Latest News

  • Saurav Ganguly: మళ్లీ కెప్టెన్ గా దాదా

  • ₹ 57,000 Crore:గౌతమ్‌ ఆదానీ “లోహ” సంకల్పం.. ఆ రాష్ట్రంలో రూ.57 వేల కోట్లకుపైగా పెట్టుబడులు!

  • టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ వయా ఆసియా కప్

  • Coconut Husk : కొబ్బరి పీచే కదా అని విసిరేయకండి, దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుస్తే షాక్ అవుతారు..!!

  • Janhvi Emotion: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. జాన్వీ ఎమోషన్ పోస్ట్!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: